05:28 AM, 7 Sunday March 2021

కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దు

– కోవిడ్ వాక్సిన్ వేసుకున్న తహశీల్దార్

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

సురక్షితమైన కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ పట్ల అపోహలు, భయాందోళనలను విడనాడి, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించు కోవాలని రాయవరం తహశీల్దార్ కె.జె. ప్రకాష్ బాబు,  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రంలో రాయవరం పి హెచ్ సి కి తహశీల్దార్ కె.జె. ప్రకాష్ బాబు స్వయంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా అయన విలేఖరులతో మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాధిని సమూలంగా నిరోధించే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షితం, ప్రభావవంతంగా నిరూపితమైన వ్యాక్సిన్ ను గత నెల 16 తేదీ నుండి ఉచితంగా అందుబాటులోకి తెచ్చాయన్నారు. రెండొవ దశగా మండలంలో  కోవిడ్-19 నియంత్రణలో ముందు వరుస యోధులుగా పనిచేస్తున్న  రెవెన్యూ,పంచాయితీ రాజ్, గ్రామ వలంటిర్లు సిబ్బంది వ్యాక్సినేషన్ చేపట్టి ఇప్పటి వరకూ  అత్యధిక సంఖ్యలో ఈ టీకాలు మండలం లో  వేయడం జరిగిందన్నారు. అయితే మండలంలో తొలిదశలో వైద్య సిబ్బంది కి టీకాలు అందించాలని చేపట్టిన లక్ష్యం చేపట్టినప్పటికీ, కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు, భయాల కారణంగా ఇప్పటి వరకూ 60 శాతం మంది మాత్రమే టీకాలు పొందడం జరిగిందన్నారు. సమగ్రమైన పరీక్షల ద్వారా అత్యంత సురక్షితమైనదిగా కోవిడ్-19 వ్యాక్సిన్ నిరూపితమైందని, వ్యాక్సిన్ కారణంగా ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని ఆయన మరో మారు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వల్ల చాలా అరుదుగా అతి తక్కవ మందిలో దద్దుర్లు, తేలికపాటి జ్వరం, తలత్రిప్పు కలిగినా, ఏమాత్రం ప్రమాదం కాదని, వ్యాక్సిన్ వేసిన ప్రతి ఒక్కరినీ అరగంట పాటు వైద్య పరిశీలనలో ఉంచుతారని, ఏవిధమైన దుష్పరిణామాలు ఎదురైనా వెంటనే తక్షణ వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక వార్డులు, వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ఇంకా ప్రజలలో కొనసాగుతున్న సందేహాలు, సంకోచాలను పటాపంచలు చేసేందుకు, నిర్బయంగా వ్యాక్సిన్ వేయించుకునేలా చైతన్య పరచేందుకు  స్వయంగా తానూ రాయవరం పి హెచ్ సి  వైద్య ఆరోగ్య అధికారి టీక వేయించుకున్నామన్నారు. ఇద్దరికీ ఏవిదమైన అస్వస్థతగాని, అసౌకర్యం గానీ కలగలేదని, వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే ఆరుబయట నిలుచుని ప్రజలతో  ముచ్చటించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దశల వారిగా ప్రజలందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ ను పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలు సురక్షితమైన, క్షేమకరమైన ఈ వ్యాక్సిన్ ను నిర్బయంగా, నిస్సంకోచంగా వేయించుకోవాలని తహశీల్దార్ కె.జె. ప్రకాష్ బాబు  కోరారు. తహశీల్దార్ తో పాటు డిప్యూటీ తహశీల్దార్ విజయ రేఖ, ఆఫీస్ సిబ్బంది ఈ పంపిణీ కేంద్రంలో కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు.   ఈ కార్యక్రమంలో పి హెచ్ సి వైధ్యాదికారిణి అంగర దేవి రాజశ్రీ,  సి హెచ్ రమ్యశ్రీ, హెచ్ ఈ సి యు సీతామాలక్ష్మి, హెచ్ వి విజయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ మెయిల్ కే వెంకటేశ్వరరావు,  ఎ ఎన్ ఎం లు  కే అనురాధ, ఎం బుజ్జి, మహిళా పోలీస్ కార్యదర్శి సత్యవతి, డేటా ఎంట్రి ఆపరేటర్ రమ్య తదితరలు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#