05:11 PM, 28 Thursday January 2021

కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి… కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కేంద్రంలో డ్రైరన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి అధికారులు….

జనవరి 12 అన్నివిధాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకై డ్రైరన్ కార్యక్రమాలు పక్కాగా నిర్వహించి పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సంబందిత ప్రభుత్వ శాఖల సిబ్బందికి రాయవరం తాసిల్దార్ కే జే ప్రకాష్ బాబు సూచించారు. మండల కేంద్రమైన రాయవరం పి హెచ్ సి వద్ద కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కేంద్రంలో డ్రైరన్ కార్యక్రమాన్ని ప్రాథమిక వైద్య అధికారిని అంగర దేవిరాజశ్రీ అద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయవరం తాసిల్దార్ కే జే ప్రకాష్ బాబు, మండల పరిషత్ అభివృది అధికారి ఎం శ్రీను, రాయవరం ఎస్సై పి వి యస్ యస్ ఎన్ సురేష్ పర్యవేక్షించారు. ఈ నేపద్యంలో తాసిల్దార్ ప్రకాష్ బాబు మాట్లాడతూ లబ్దిదారుని డేటా నమోదు, వ్యాక్సినేషన్ గది, అబ్జర్వేషన్ హాలు తదితర ప్రక్రియలను అయన పరిశీలించి అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో వుంచిన మందులు వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలో దశలవారీగా కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సన్నద్ధతను పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం సూచనలు మేరకు డ్రైరన్ చేపట్టామని తాసిల్దార్ ప్రకాష్ బాబు అన్నారు. వాస్తవ పరిస్థితులలో టీకా వేసేందుకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు పటిష్టం ఏర్పాట్లు గావించాలన్నారు. వ్యాక్సిన్ కు సంబందించి ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించేలా హెల్ప్ డేస్కును కూడా అందుబాటులో ఉంచాలన్నారు.

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జనవరి 12 అన్నివిధాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకై డ్రైరన్ కార్యక్రమాలు పక్కాగా నిర్వహించి పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సంబందిత ప్రభుత్వ శాఖల సిబ్బందికి రాయవరం తాసిల్దార్ కే జే ప్రకాష్ బాబు సూచించారు. మండల కేంద్రమైన రాయవరం పి హెచ్ సి వద్ద కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కేంద్రంలో డ్రైరన్ కార్యక్రమాన్ని ప్రాథమిక వైద్య అధికారిని అంగర దేవిరాజశ్రీ అద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయవరం తాసిల్దార్ కే జే ప్రకాష్ బాబు, మండల పరిషత్ అభివృది అధికారి ఎం శ్రీను, రాయవరం ఎస్సై పి వి యస్ యస్ ఎన్ సురేష్ పర్యవేక్షించారు. ఈ నేపద్యంలో తాసిల్దార్ ప్రకాష్ బాబు మాట్లాడతూ లబ్దిదారుని డేటా నమోదు, వ్యాక్సినేషన్ గది, అబ్జర్వేషన్ హాలు తదితర ప్రక్రియలను అయన పరిశీలించి అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో వుంచిన మందులు వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలో దశలవారీగా కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సన్నద్ధతను పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం సూచనలు మేరకు డ్రైరన్ చేపట్టామని తాసిల్దార్ ప్రకాష్ బాబు అన్నారు. వాస్తవ పరిస్థితులలో టీకా వేసేందుకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు పటిష్టం ఏర్పాట్లు గావించాలన్నారు. వ్యాక్సిన్ కు సంబందించి ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించేలా హెల్ప్ డేస్కును కూడా అందుబాటులో ఉంచాలన్నారు. త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎలాంటి అపోహలకు తావులేకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అయన సూచించారు. ప్రతి ప్రాథమిక వైద్య కేంద్రంలోనే అత్యవసర వైద్య సేవలు మందులు కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని వైద్యులు దృవీకరించారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు పుకార్లు నమ్మవద్దని అయన స్పష్టంచేసారు. టీకా వేసుకొనేందుకు సిద్ధపడుతూ మీతోపాటు మీ కుటుంబాలను సమాజాన్ని ఆరోగ్యకరంగా ఉంచాలన్నారు. టీకాతో ఎటువంటి దుష్పరిణామాలు ఒకవేళ వస్తే దద్దుర్లు వాంతులు చిన్నపాటి జ్వరం వంటివి వస్తాయని అలాంటి సందర్భంతో తక్షణమే స్పందించేందుకు అబ్జర్వేషన్ గదిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో వుండి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా డ్రైరన్ కార్యక్రమాలు నిర్వహించామని మరో విడత నేడు నిర్వహించడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ సిబ్బంది పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అయన స్పష్టం చేసారు. అన్ని కేంద్రాలలో నిర్దేశిత ప్రామాణాలలో ఏర్పాట్లు పూర్తి స్థాయిలో వుండాలన్నారు. ఎం పి డి వో శ్రీను మాట్లాడతూ ప్రత్యేకాధికారులు వైద్య సిబ్బంది ఇతర శాఖల సమస్వయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు కొవిడ్ నియంత్రణ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రంట్ లైన్ హెల్త్ వర్కర్లుకు తొలుత వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రెండవ విడతలో వ్యాక్సిన్ పంపిణీ చేసే పోలీసు శానిటేషన్ సిబ్బంది డేటాను సేకరించడం జరుగుతోందన్నారు. కోవిడ్ నిరోధానికి పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదన్నారు. వ్యాక్సిన్ పంపిణీ చేసిన అదే కేంద్రంలో ఏర్పాటు చేసిన అబ్జర్వేషన్ గదిలో 30 నిమషాలపాటు వైద్య పరిశీలన ఉంచిన పిమ్మట వ్యాక్సిన్‌ తీసుకొన్న వారిని పంపాలన్నారు. రాయవరం పి హెచ్ సి లో నిర్వహించిన డ్రైరన్ కార్యక్రమాలనుద్దేశించి రాయవరం ప్రాథమిక వైద్య అధికారిని అంగర దేవిరాజశ్రీ మాట్లాడుతూ డ్రైరన్ కు సంబందించి తొలుతగా కేంద్రం ముందుభాగంలో ఒక అంగన్ వాడీ కార్యకర్త, మహిళా పోలీసు, ఆశా వర్కరు విధులు నిర్వహిస్తారని వారు వచ్చిన లబ్దిదారుని మాస్కు దరించేలా మరియు శానిటేషన్, బౌతిక దూరాలు పాటించేలా ధర్మల్ గన్ తోటెంపరేచరును పరిశీలించడం. కోవిడ్ లక్షణాలు లేకుండా నార్మల్ గా ఉన్నవారిని లోపలికి అనుమతించడం జరుగుతుందని, తదుపరి డేటా ఎంట్రీ ఆపరేటరు వద్దకు వెళ్లి తమ ఆదార్ కార్డును చూపించి పేరును నమోదు చేయించుకుంటారన్నారు. ఆ తర్వాత వ్యాక్సిన్ ఇజెక్షన్ చేసే గదికి వెళతారని అక్కడ ఇద్దరు ఎఎన్ఎంలు, ఒక ఆశా వర్కరు ఉంటారని వారు ఇజెక్షన్ చేసిన పిదప బయోవెస్టు డిస్పోజల్ విధానాలను కోవిడ్ నిబంధనలమేరకు చేపడతారన్నారు. తదుపరి అబ్జర్వేషన్ గదిలోని 30 నిముషాలపాటు ఉంచి ఏవిధమైన దుష్పరిణామాలు ఉత్నన్నం కాకపోతే మరలా డేటా ఆపరేటరు వద్దకు పంపి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాబడిందని పోర్టల్ లో డేటా ఎంట్రీ చేయిస్తారన్నారు. వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్న 28 రోజులు తర్వాత మొదటి డోసు వేయించుకున్న కంపెనీ మందునే మరలా వేయించుకోవాలని ఆమె స్పష్టంచేసారు. వ్యాక్సినేషన్ చేసేవారు తప్పనిసరిగా పిపిఇ కిట్లును ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సిహెచ్. రమ్యశ్రీ, హెచ్ ఈ సీతా మహాలక్ష్మి, ఎఎన్ఎం, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#