03:06 AM, 3 Wednesday March 2021

క్రైస్తవుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలి..శ్యాంపాల్

# నూతన కార్యవర్గం ఎంపిక
# గుర్తింపు కార్డులు జారీ

, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

క్రైస్తవులపై,క్రైస్తవ దేవాలయాలపై ఈ మధ్య కాలంలో దాడులు పెరిగాయని తక్షణమే వాటిని నిరోధించి,క్రైస్తవుల సమస్యలపై,కనీస హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు స్పందించాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కొలకలూరి శ్యామ్ పాల్ కోరారు.అమలాపురం పట్టణంలోని ఏ’ కన్వెన్షన్ హాల్లో కోనసీమ ఏరియా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నూతన కార్యవర్గ ఎంపిక,సమావేశం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బిషప్ జోసఫ్ ఆండ్రూస్ అధ్యక్షతన జరిగింది.గౌరవ అధ్యక్షులుగా నున్న ప్రభు కుమార్,అధ్యక్షులుగా జె.అజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శిగా పి.జోసెఫ్ తేజ,రామచంద్రపురం ఏరియా కార్యదర్శిగా ప్రభుకుమార్ జోసఫ్,అమలాపురం ఏరియా కార్యదర్శిగా ఆర్.జోసఫ్,జి.జాన్,పి.జయపాల్,స్త్రీల సమాజం అధ్యక్షురాలిగా పి.షీబాసాహిత్య,కార్యదర్శిగా హెప్సిబా,యూత్ వింగ్ అధ్యక్షులుగా ప్రసన్నకుమార్,చిల్డ్రన్స్ వింగ్ జాన్ పాల్, స్టూడెంట్ వింగ్ ఎం.ప్రవీణ్,మీడియా వింగ్ కే.జాషువా, ప్రేయర్ వింగ్ కిషోర్ లను నియమించి,జాతీయ అధ్యక్షులు శ్యాంపాల్ ఒక సంవత్సరం కాలపరిమితితో అధీకృత గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు ఏపి రాష్ట్ర మీడియా వింగ్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల సాల్మన్ దొర ఒక ప్రకటనలో తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఆయా విభాగాల వారందరూ క్రైస్తవ సమాజ సమస్యలపై స్పందిస్తూ అండగా నిలవాలని,ప్రభుత్వాలు క్రైస్తవుల సంక్షేమం కొరకు ఇస్తున్న సంక్షేమ పథకాలను సైతం అందించే సహాయం చేసి క్రైస్తవ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జార్జ్ ముల్లర్, ప్రధాన కార్యదర్శి మనోజ్ బాబు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చైతన్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#