, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ఎస్బీఐ ఏటీఎంలలో డబ్బు తీసే ముందు మీ ఖాతాలో డబ్బు ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాతే విత్డ్రా చేయండి. ఎందుకంటే విత్డ్రా చేసే సమయంలో ఖాతాలో సరిపడా డబ్బులేకపోతే జరిమానా పడుతుంది. ఈ మేరకు ఎస్బీఐ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వాటి ప్రకారం.. ఖాతాలో సరిపడా డబ్బు లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన ప్రతీసారి రూ.20+జీఎస్టీ జరిమానా పడుతుంది. పరిమితికి మించి డబ్బు విత్డ్రా చేస్తే కూడా చార్జి పడుతుంది