11:20 PM, 3 Wednesday March 2021

గాంధీజీ ఆశయాల వైపు అడుగులు వేద్దాం –

– కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

 గాంధీజీ ఆశయాల వైపు అడుగులు వేద్దామని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. గాంధీ వర్ధంతి సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ ఉద్యోగులందరూ మౌనం పాటించి గాంధీజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడను గాంధీజీ సందర్శించిన సంఘటనలను గుర్తు చేశారు. 1923 కాకినాడలోని జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలలో గాంధీ పాల్గొన్నారన్నారు. వారి ఆశయ సాధనకై మనమంతా కృషి చేయాలని తెలిపారు. కాకినాడ నగరానికి గాంధీతో ఉన్న సంబంధం ఎంతో ఉన్నతమైనదని అవినాభావ మని తెలిపారు. సాటర్డే – క్లీనింగ్ డే కావడంతో భారత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న గాంధీ కలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ వారి వారి పరిసరాలను, కార్యాలయ ఆవరణ మాత్రమే కాకుండా నగరం అంతా తమ బాధ్యతగా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్తను వేయడానికి చెత్త బుట్టలను వాడాలని తెలిపారు. కాకినాడ లోని గాంధీభవన్ గాంధీ సందర్శనకు చిహ్నమని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#