05:29 AM, 15 Friday January 2021

గూడు లేని పేదలకు ముందుగా వచ్చిన నిజమైన పండుగ రోజు

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండల పరిధిలో  చొప్పెల్ల లేఅవుట్లో 409 మంది లబ్ధిదారులతో పాటుగా, నర్శిపూడి, సంధిపూడి, పెద్దపల్ల, పినపల్ల, మడికి, మూలస్థానం అగ్రహారం గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను మంగళవారం నాడు కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు పి యు సి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి పంపిణీ చేశారు. ముందుగా మండల ప్రజాపరిషత్ పరిపాలనా అధికారి టీవీ సురేందర్రెడ్డి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అన్ని అర్హతలు ఉండి ఇళ్లు పట్టాలు పొందలేని అక్కా చెల్లెమ్మలకు నేడు జగనన్న ఇస్తున్న ఇళ్ల పట్టాలు పొందుతున్న మహిళల్లో ముందుగా వచ్చిన నిజమైన పండుగ రోజుని, మహిళల్లో ఆనందభాష్పాలుగా ఉప్పొంగుతాయని, జగనన్న పాలన దేశానికే ఆదర్శమని  పేదల సొంతింటి కలను సాకారం చేసే మహోన్నత పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా  అమలు చేయడం ద్వారా యావత్తు  దేశానికే ఆదర్శంగా నిలిచారని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున 30 లక్షలకు పైగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం దేశ చరిత్రలోనే  నిలిచిపోతుందని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులపై ఉందని అర్హులై ఉండి ఎవరికైనా ఇంటిస్థలం రాకపోతే వెంటనే మీ గ్రామ  సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే  90 రోజుల్లో వారికి ఇంటి స్థలం మంజూరు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనువాసు, తోరాటి లక్ష్మణ రావు, దియ్యన పెద్దకాపు, ఏఎంసీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్, యెరుబండి నర్సింహమూర్తి, చల్లా ప్రభాకర్రావు, ద్వారపూడి సత్యనారాయణరెడ్డి (దొరబాబు), మంతిన రవిరాజు, పాలెంగి ఉమాదేవి,  ఎంపీడీవో జేఏ ఝాన్సీ, తహసిల్దార్ లక్ష్మీపతి, ఆర్ఐ జానకి రాఘవ, హౌసింగ్ ఏఈ జేజిబాబు, మండల ప్రజాపరిషత్తు పరిపాలనా అధికారి టీవీ సురేందర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పోచమ్మ, పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#