09:57 AM, 2 Tuesday March 2021

గ్రామపంచాయతీలో ఏ సమస్య వచ్చినా ముందుంటాం

గ్రామపంచాయతీలో ఏ సమస్య వచ్చినా మేం ముందుంటాం
– చోడవరం ఎంపిటిసి ఎలమోలు.రమేష్ , సర్పంచ్ మణి

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

తన స్వగ్రామమైన చోడవరం గ్రామపంచాయతీ పరిధిలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తాను , సర్పంచ్ పొడియం.మణి ముందుంటామని వైసిపి నాయకులు , చోడవరం ఎంపిటిసి ఎలమోలు.రమేష్ గ్రామస్తులకు తెలియజేశారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పంచాయతీ ఎన్నికల్లో వైసిపికి ప్రజలు పట్టం కట్టారని ఎంపిటిసి ఎలమోలు.రమేష్ పేర్కొన్నారు. చోడవరం వైసిపి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన పొడియం.మణిని ఓటర్లు ఆశీర్వదించి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లే కీలకమని , వారే కీలకపాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. తద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చోడవరంలో అభివృద్ధి చేసి చూపిస్తామని వారు పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందేలా చర్యలు , అంతర్గత రోడ్లు , మంచినీరు , పోడుభూములకు పట్టాల వంటి ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ (బాబు) , ఎమ్మెల్యే నాగులపల్లి.ధనలక్ష్మి సహకారంతో కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళుగా సుపరిపాలన అందిస్తున్నారని తద్వారా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని వారు పేర్కొన్నారు. కావున ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలని , వైసిపిని ఎప్పటికీ ఇలాగే ఆదరించాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#