మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండపేట మండలం ద్వారపూడి శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానం , అయ్యప్ప ఆలయ ట్రస్ట్ ఆసుపత్రి ప్రధమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్ధాపకులు గురుస్వామి కనకరాజు ఆధ్వర్యంలో మండపేట, ద్వారపూడి పరిసర గ్రామ పీఎంపీ సభ్యులకు వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా గురుస్వామి కనకరాజు మాట్లాడుతూ పేదలకు చేసిన సేవలు భగవంతుని కి చేసినట్లేనని పేర్కొన్నారు. ఈసేవలో ప్రతీ పీఎంపీ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సదస్సులో అయ్యప్ప ఆలయ ట్రస్ట్ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ కుమార్,అనపర్తి కి చెందిన కంటి వైద్యులు డాక్టర్ నారాయణ రెడ్డి లు హాజరయ్యారు.వారు మాట్లాడుతూ గ్రామాల్లో పేదలకు వైద్య సేవలందించే పీఎంపీలు అయ్యప్ప ఆలయ ట్రస్ట్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత సేవలందించాలని కోరారు. నామమాత్రపు ఫీజ్ తో పేదలకు అందుబాటులో వైద్య సేవలందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పీఎంపీ సభ్యులు గురుస్వామి కనకరాజు, వైద్యులను ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో పీఎంపీ కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు,మండల కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, ఇరవాడ రవికుమార్, ఇందన వెంకటేశ్వరరావు,అవ్వరు శివాజీ ,మండిపూడి చంద్రశేఖర్,శ్రీనివాసరాజు లతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.