05:02 AM, 3 Wednesday March 2021

ఘనంగా వర్ధమాన యువ హీరో జన్మదిన వేడుకలు

కాకినాడ రూరల్, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

సేవా కార్యక్రమాలకు ప్రతి రూపం, ప్రేమ అభిమానానికి హద్దులు లేని వ్యక్తి మాదారపు తాతాజీ అని వర్ధమాన యువ సినీహీరో దాట్ల సుబ్బరాజు కొనియాడారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో తాతాజీ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు జన్మదినోత్సవ వేడుకలు అభిమానులు మధ్య శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ సుబ్బరాజు పుట్టినరోజు మాత్రమే కాకుండా దాట్ల ప్రొడక్షన్స్ హేమ అస్మిత సంయుక్తంగా నిర్మించి నటించిన చిత్రం డిటెక్ట్ సినిమా రిలీజ్ అన్నారు. డిటెక్ట్ సినిమాలో సుబ్బరాజు హీరోగా పోలీస్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారన్నారు. వర్ధమాన యువ హీరో సుబ్బరాజు మాట్లాడుతూ డిటెక్ట్ చిత్రానికి హీరోగా, నిర్మాతగా చేశానని తెలిపారు. యూట్యూబ్ లో డిటెక్ట్ చిత్రానికి సంబంధించిన సంభాషణలు సన్నివేశాలను రిలీజ్ చేయడం జరిగిందన్నారు. చిత్ర నిర్మాణానికి సహకరించిన నటి, నటులకు, యూనిట్ సబ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రజలంతా ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జాన్, కాకినాడ ఫిలిం క్లబ్ అధ్యక్షుడు రాయపల్లి శ్రీనివాసరావు, చిత్రం నటినటులు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#