03:58 AM, 4 Thursday March 2021

చక్కదిద్దక పోతే…””ఆ పంచాయితీలు అధిష్టానానికి హరి”

– అందరి కళ్ళు…""ఆ రెండింటి మీదే""
– ఆ పంచాయితీలు సెట్ చెయ్యక పోతే…""పోయినట్లేనా
– చీలిపోనున్న వైసిపి ఓట్లు, ప్రత్యర్థులకు బలం చేకూర నున్నట్లు ఆరోపణలు
– గ్రామ పంచాయితిలో పట్టు బిగుస్తున్న ప్రత్యర్ధ బృందాలు.
– రెండు పంచాయితీలో వైసిపి కార్యకర్తల అయోమయం.
– ఇప్పటికే తమ పదవులకు రాజీనామాలు ప్రకటించిన వైసిపి నాయకులు.
– మండలంలో హాట్ టాపిక్ గా మారిన వైనం.
– వైసీపీలో తలనొప్పిగా మారనున్న రెబల్స్
– నామినేషన్ పూర్తి కాక ముందే అధిష్టానం స్పందించాలని వైసిపి కార్యకర్తలు విజ్ఞప్తి

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలో గ్రామ పంచాయితీ ఎన్నికలు కు పలు పార్టీల అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. అందులో మొన్నటి వరకు పొత్తులు కోసం పరుగులు తీసిన పార్టీలు ఎట్టకేలకు పంచాయితీలు 6, 5 గా సంఖ్య ను సరి చేసుకొని  గ్రామాల్లో అభ్యర్థులను నామినేషన్ వేయించుకోవడానికి సమయత్తమయి కొన్ని నామినేషన్ లు శనివారం వేయించడం జరిగింది. ఇది ఇలా ఉండగా అధికార పార్టీ మాత్రం తమ పార్టీ అభ్యర్థులను కొన్ని పంచాయితిలలో నామినేషన్ వేయించుకోవడం కోసం ముందుకు వెళ్తున్నా సమయంలో కొన్ని అవాంతరాలు వారికి వారే అడ్డు పెట్టుకున్నారు.  ఈ నేపథ్యంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రెండు పంచాయితీలలో “”హాట్ టాపిక్ “”గా మారింది.  అధిష్టానం సైతం చక్కదిద్దక పోతే వైసిపి ఓట్లు చీలే అవకాశాలున్నాయని మండలంలో  ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో విబేధాలు వచ్చి రోడ్డు పడ్డాయి.
రేకపల్లిలో రెండు వర్గాల మధ్య విబేధాలు
మండలంలోని రేఖపల్లి గ్రామ పంచాయితిలో వైసిపి పార్టీ తరుపున రెండు వర్గాలు మధ్య విబేధాలు వచ్చాయి.  సీనియర్ పాత కాంగ్రెస్ లో నుండి వైసిపి లోకి వచ్చిన నాయకులు, అదే తరహాలో మొదట నుండి వైసిపి పార్టీకి బలమైన సపోర్ట్ అందిస్తున్న వ్యక్తి, ఒక అభ్యర్థిని బరిలో దించారు. ఇదే క్రమంలో , వైసిపి పార్టీ లో మొదట నుండి అదే పార్టీని నమ్ముకొని ఉన్న మరో  నాయకుడు వేరే అభ్యర్థిని ఆ గ్రామ పంచాయితీ కి సర్పంచ్ అభ్యర్థులను నామినేషన్ వేయించు కోవడం కోసం తల పడుతున్నారు. ఈ క్రమంలో అధిష్టానం సైతం ఒక జూనియర్ నాయకుడు వైసిపి పార్టీ ప్రారంభ మైన దగ్గర నుండి సేవలు అందిస్తూ వస్తున్న క్రమంలో అతను ఎంచుకున్న అభ్యర్థిని నిలబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అదే వైసిపి పార్టీ మొదట నుండి బలపడటానికి అన్ని విధాలా సహకారం అందించిన సీనియర్ నాయకుడు తన తరుపున వేరే ఒక అభ్యర్థిని బరిలో దించనున్నారు. తను ఒక పెద్దగా వైసీపీలో మొదట నుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూన్నాడు. తను బలపరుస్తున్న  అభ్యర్థిని అధిష్టానం సైతం వైసిపి తరుపున వద్దన్నందుకు తనకున్న పదవికి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా ముఖంగా తెలియ జేశారు.  ఏ అభ్యర్థిని వైసీపీలో పోటీకి ఉంచాలని దానిపై ఇప్పటికి అధిష్టానం తరుపున రెండు వర్గాల మండల వైసిపి నాయకులకు మధ్యవర్తిగా కొందరు నచ్చ చెప్పుతున్నప్పటికి ఒక కొలిక్కి రాలేదు.  ఈ వర్గ విబేధాలు ఇలా ఉండగా రేఖపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామాల ఓటర్లు ఎవరికి ఓటు వెయ్యలో తెలియక తలపట్టుకుంటున్నారు.
వడ్డిగూడెం పంచాయితిలో అదే పరిస్థితి. 
వడ్డిగూడెం గ్రామ పంచాయితిలో మళ్ళీ రెండు వర్గాల మధ్య చిచ్చు లేసింది. పార్టీని నమ్ముకొని మొదట నుండి పని చేస్తున్నామని ఒక వర్గం , వైసిపి పార్టీలో  పాత కాంగ్రెస్ నుండి వైసీపీలోకి వచ్చిన కొంతమంది నాయకులు మేము గెలిచే అభ్యర్థిని పెట్టి వైసీపీకి గ్రామ పంచాయితిని వైసీపీకి అంకితం ఇస్తామని వారి  వాదన వినిపిస్తున్నారు..ఈ రెండు వర్గాలు  వీరు ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే విషయంలో  తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీని  మొదట నుండి నమ్ముకొని పార్టీకి సహకారం అందించిన అభ్యర్థిని అధిష్టానం వైసిపి తరుపున పోటీకి సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా పాత కాంగ్రెస్ నుండి వచ్చిన నాయకులు గతంలో తమ అయాంలో సర్పంచిగా పనిచేసిన మాజీ సర్పంచ్ కు పంచాయితిలో మంచి పేరుంది. కనుక ఆమెను పోటీ చేపిస్తే గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ ఇరు వర్గాల మధ్య విబేధాలు ఒకే పార్టీ నుండి తలెత్తడంతో  ఓట్లు చీలిక ఏర్పడనున్నది. ఇందులో ఇప్పటికే ఒక అభ్యర్థి సర్పంచ్ గా నామినేషన్ శనివారం వెయ్యడం జరిగింది. మరో అభ్యర్థి ఆదివారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు వర్గాల అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చెయ్యకుండా   పోటీలో ఉంటే ఓట్లు చెలీ అవకాశాలున్నాయి. వీరిరువురి మధ్య  ప్రతి పక్షంగా ఉండే అభ్యర్థి విజయం తజ్యమని ఆశావాహులు అంటున్నారు. వైసీపీలో ఉన్న వర్గ విబేధాలతో అధికార పార్టీ కంటే బలమైన శక్తిని ప్రతిపక్షాలైన మిత్ర పక్షాలదే పై చెయ్యి అవుతాదని మండలంలో ఆరోపణలున్నాయి.
ఆ పంచాయితీలు ఇనామాస్ చేస్తే బాగుంటదట
ఇప్పటికే మండలంలో మూడు పార్టీలకు మూడు పంచాయితిలో ఒక బ్రాండ్ ఉన్నది. తుమ్మిలేరు లో టిడిపికి గట్టిపట్టు ఉన్నది. అదే విధంగా రాజుపేటలో వైసీపీకి పట్టు ఉన్నది. శ్రీరామగిరిలో సిపియం గెలుపుకుపెట్టింది పేరు. అయితే ఈ మూడు పంచాయితీలు ఎవరికి వారే ఇనామాస్ గా ప్రకటించుకుంటే గ్రామ పంచాయితీలు వచ్చే రూ. 15 లక్షలు వస్తాయి. ఆ పంచాయితిలలో అభివృద్ధికి వాడుకోవచ్చు.
వైసిపి అధిష్టానం స్పందించక పోతే
మండలంలో ఇప్పటికే 11 గ్రామ పంచాయితిలలో మూడు పంచాయితీలు పార్టీకి ఒకటి వాస్తదన్నది అందరి వాదన. అయితే ఇప్పటికే అధికార పార్టీని ఓడించి మిగతా పంచాయితీలు కూడా గెలవాలని రెండు పార్టీలు(సిపియం, టిడిపి) పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా అభ్యర్ధులని నిలబెట్టే దగ్గర తారతమ్యాలు లేకుండా నామినేషన్ లు వెయిస్తున్నారు. ఈ క్రమంలో మిత్ర పక్షాల పార్టీలే అంత శ్రద్ధగా పట్టుదలతో ఉంటే అధికార పార్టీ విబేధాలతో బగ్గుమంటుంటే వైసిపి కార్యకర్తలు వైసిపి నాయకుల తీరు చూసి  మండి పడుతున్నారు. మండలంలో సంవత్సార కాలం నుండి అధికార పార్టీలో వర్గాలు ఏర్పడుతున్న సమయంలో గతంలో అధిష్టానం ఒక్క సారి మందలించింది. అయినప్పటికీ వారిలో మార్పు కనబడక పోవడంతో నేడు ఆ ఎఫెక్ట్ గ్రామ పంచాయితీ ఎన్నికలలో పడ్డాయి.  నాయకుల్లో మాత్రమే ఈ బేధాలున్నాయి కానీ కార్యకర్తలు మాత్రం ఏవరికి ఓటు వెయ్యలో ఒక నిర్ణయానికి వస్తున్నారు. గతంలో ఈ బేధాలపై అధిష్టానం చూసి చూడనట్లు ఉండటం వలన నేడు ఈ అధికార పార్టీ నాయకుల వలన పార్టీ పటిష్ఠతకు దెబ్బ తగలనున్నది.  అధికార పార్టీ ఎక్కువ స్థానాలు రావడానికి వారు ప్రవేశ పెట్టుతున్న పధకాలు కారణం అని అంటున్నారు. కానీ గ్రామాల్లో చూస్తే వ్యక్తి గత కారణాల వలన కొన్ని పంచాయితీలు అవతలి వారి గెలుపుకు పధకాలు కూడా అడ్డు రానట్లే ఉన్నది. ఎక్కడ చూసినా రెండు పంచాయితీలు గురించి చర్చిస్తున్నరు. నామినేషన్ లు రెండు వర్గాలున్న చోట సరైన నిర్ణయం తీసుకొని ఒకరిని పోటీలో దించి ఆవర్గాలు లేకుండా నాయకులు పని చేయక పోతే  ఆ పంచాయితీలు వైసిపి ఖాతాలో గల్లంతు అవకా తప్పదు అని మండలంలో ఆరోపణలు కోడై కూస్తుంది. వైసీపీలో  వర్గ విబేధాలు చూసి రెబల్స్ కూడా చోటు దక్కే అవకాశాలున్నాయి.  వైసిపి అధిష్టానం స్పందించక పోతే నాయకుల విబేధాలతో ఆ రెండు పంచాయితీలు పోయినట్లే అని అందరి నోటా అదే మాట వినబడుతుంది.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#