– సిడిపిఓ రాజ్యలక్ష్మి
పెనుమంట్ర, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
చిన్నారులకు అర్థమయ్యే రీతిలో మాటలు, పాటలు నేర్పాలని ఐసిడిఎస్ సిడిపిఓ తంగిరాల రాజ్యలక్ష్మీ అన్నారు .ఈ నెల ఇరవై రెండో తేదీ వరకు అంగన్వాడీ కేంద్రంలో ఇంగ్లీష్ భాషలో మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో మాట్లడటం, ఆటలు వంటి వాటి పై అంగన్వాడీలకు శిక్షణ మంగళవారం వరకు ఆయా అంగన్వాడీ కేంద్రంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతు తల్లులు,మీ పిల్లలను పాఠశాలలో మాదిరి వలే అంగన్వాడీ కేంద్రంలో కూడా పిల్లలను చదువు సంబంధించిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించడం జరిగిందని అన్నారు.ఈ శిక్షణా కేంద్రంలో ఆయా సెక్టార్లలో సూపర్ వైజర్ లు డివి.మాణిక్యాంబ, ఎన్.మల్లేశ్వరి, ఆయా అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న మహిళా విభాగం కార్యదర్శులు,అంగన్వాడీలు పాల్గొన్నారు.