10:21 AM, 2 Tuesday March 2021

చెన్నంపేట , చంద్రంపాలెంలో వైకాపా ఇంటింటి విస్తృత ప్రచారం  

– సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ
– ఎటపాక పంచాయతీలో వైకాపా శ్రేణుల భారీ బైక్ ర్యాలీ
– జిల్లా నాయకులు కొవ్వూరి.రాంబాబు , కురినాల.వెంకట్ సారధ్యంలో

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎటపాక వైకాపా సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ వైకాపా పార్టీ నాయకులు , కార్యకర్తలతో శనివారం ఎటపాకలో వైకాపా జిల్లా కార్యదర్శి కొవ్వూరి.రాంబాబు , కురినాల.వెంకట్ (బుజ్జి) సారధ్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మండల పరిధిలోని చెన్నంపేట , చంద్రంపాలెంలో సర్పంచ్ అభ్యర్థి మరియు వైకాపా శ్రేణులతో కలిసి భద్రాచలం పట్టణంలోని నాయకులు , ప్రముఖ వైద్యులు డా.తెల్లం.వెంకట్రావు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డా.తెల్లం.వెంకట్రావు ఓటర్లనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తించి వైకాపా సర్పంచ్ అభ్యర్థికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం చంద్రంపాలెం ప్రధాన కూడలి నుండి సుమారు 200 మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ ప్రారంభించి చెన్నంపేట , బొజ్జిగుప్ప , ఎటపాక , మేడువాయి మీదుగా రాజుపేట గ్రామం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కొవ్వూరి.రాంబాబు , కురినాల.వెంకట్ (బుజ్జి) మాట్లాడుతూ వైకాపా పార్టీ అధినేత , రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజల్లో విశిష్ట ఆదరణ పొందాయని గ్రహించి ఇతర పార్టీల నాయకులు కావాలని వైకాపాపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఏదిఏమైనా రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైకాపా సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని , దానికొరకు పార్టీ నాయకులు , కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు డేగల.రామకృష్ణ , వైకాపా సీనియర్ నాయకులు శీలం.కృష్ణ , ఎటపాక యూత్ కార్యదర్శి మోతుకూరి.రాంప్రసాద్ , మండల నాయకులు బర్ల వెంకటరత్నం , కాకా.చిట్టిబాబు , మండల యూత్ నాయకులు దాసరి.నరేష్ , ధనపాల.నవీన్ , గజ్జల.శ్రీను , సంతపూరి.వెంకటేశ్వర్లు , సంతపూరి.శ్రీను , బుయ్యని.గణేష్ , సంగం.బాలు , తమ్మిశెట్టి.రత్నం , పుట్టి.సంపత్ , చెలికాని.సురేష్ , గజ్జల. విష్ణువర్మ , మాచర్ల.బాబూరావు , మాచర్ల.కిరణ్ , కట్టా.సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#