02:44 AM, 24 Sunday January 2021

జగనన్న “”ఇళ్ల పట్టా” భిషేకం

– ఈ పట్టాలు నా పుట్టింటి వారిచ్చారని, నా అన్న ఇచ్చాడని ప్రతి అక్క చెల్లి చెప్పండి.
– ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు
– ఏళ్ళు పాలించిన పార్టీలు ప్రజలకు చేసింది ఏమీలేదు.
– ఇళ్ల పట్టాలు పొందిన వారికి ఒక్కో ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేపట్టుతం
– రాష్ట్రంలో 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం అందిస్తుంది.
– మిగిలిన పంచాయితిలో కూడా పట్టాలు పంపినిచేస్తాం.
– ఈ పంచాయితిలలో తహశీల్ధార్ ద్వారా అందరికి పట్టాలిచ్చే కార్యక్రమం చేపడతాం.
– జీతం లో అందని గిరిజనులకు అర్ ఓ యఫ్ అర్ పట్టాలు అందిస్తాం.
– ఇళ్ల నిర్మణం కూడా లబ్ధిదారులకు అనుకూలంగా మూడు రకాలుగా నిర్మాణం చేస్తాం

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర చేసి , రాష్ట్ర ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. ఆ ప్రజల కష్టాలు పోవాలంటే నవరత్నాలు అందించాలని తలచి నేడు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను దశల వారిగా చేసుకుంటూ వస్తున్నారని నేడు వి.అర్.పురం మండలంలో శ్రీసీతారాముని పట్టాభిషేకంలా …జగనన్న “”ఇళ్ల పట్టా””భిషేకం జరిగిందని జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయం భాస్కర్ , రంపచోడవరం ఎమ్యెల్యే నాగుల పల్లి ధనలక్ష్మి అన్నారు. మండలంలోని తెల్లవారి గూడెంలో  మండల తహశీల్ధార్ శ్రీధర్ ఆధ్వర్యంలో జగనన్న ..””ఇళ్ల పట్టా” భిషేకం కార్యక్రమం ఘ్నంగా నిర్వహించారు.  ఎన్నికల హామిలో ఎంతో మంది ముఖ్య మంత్రులు హామీల వర్షం కురిపించారే తప్ప అవి ఎక్కడా అమలు అయిన దాఖలాలు లేవని అవి ప్రజల వద్దకు చేరలేదని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి తన పాద యాత్రలోను, ఎన్నికల హామిలోను ఏదైతే చెప్పేడో అదే నేడు చేస్తున్నారని అన్నారు. సంవత్సారా కాలంలో హామీ ఇచ్చిన అన్నిసంక్షేమ కార్యక్రమాలు, పధకాలను ఆమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కుల, మాత, పార్టీలకు అతీతంగా ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. హామీలు ఇచ్చిన వాటినే కాకుండా హామీలు కూడా ఇవ్వని అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ప్రజల మనిషిగా నిరూపించుకున్నారని అన్నారు. గత ఎన్నికల్లో మన నియోజక వర్గ ఎమ్యెల్యే ధనలక్షి ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు. మెన్ నియోజక వర్గంలో కనీసం రహదారి లేని అనేక గ్రామలున్నాయని నేడు ఆ గ్రామాలకు రహదారి మార్గాలు కల్పించడం జరిగిందని , సాగు, త్రాగు నీటి వసతిని కూడా ఏర్పాటు చేశామని అందుకు కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రజల అవసరాలను తీర్చడం జరిగిందని పేర్కొన్నారు. ముంపు మండలాల నిర్వాసితుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి వారందరికి మెరుగైన ప్యాకేజి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజలకు అర్హులైన వారికి ఎటు వంటి అవినీతికి తావులేకుండా అధికారులతో పర్యవేక్షణ చేయించి ముందుకు సాగే విధంగా చేస్తున్నామని అన్నారు.
– అర్హులైన లబ్ధిదారులకు కోట్ల రూపాయలు,
* వి.అర్.పురం మండలంలో  రైతుభరోసా పధకం ద్వారా ఒక్కో రైతుకు రూ 13. 500 ల చొప్పున 2019 లో 956 మందికి 73 లక్షల 25 వేలు అందించడం జరిగిందని 2020లో 2,429 మంది రైతులకు 2 కోట్ల 80 లక్షలు ఇచ్చామని పేర్కొన్నారు.
* అదే విధంగా వైయస్ అర్ పధకం ద్వారా రూ .2000 ల నుండి 2250 వరుకు, పెంచుకుంటూ వెళ్లడం జరుగుతోందని ఈ ఐదు సంవత్సారాల్లో 3,000 వేల రూపాయలు ప్రతి లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామని పేర్కొన్నారు
* చేయూత, చేదోడు, ఆసరా, వయసు అర్ సున్న వడ్డీ, అమ్మవడి, కాపునేస్తాం, వాహన మిత్ర, పాస్టర్ల ఇమాంలు, ఆరోగ్య శ్రీ కార్డులు, అర్ ఓ యఫ్ అర్ పట్టాలు, వైయస్ అర్ సంపూర్ణ పోషణ పధకం, 2019 లో గోదావరి వరఢాబాధితులకు జగనన్న విద్య కానుక ఇండ్ల పట్టాలు తదితర పధకాలు పెట్టి వేళా కోట్ల రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు అందిస్తుందని దేశంలో ఈ జగన్ ప్రభుత్వమే అని అన్నారు. పలు దేశాలు సైతం  మనరస్త్రం వైపు కన్నెత్తి చూడటం ఇదే మొదటి సారని, ఏ ప్రభుయవం పెట్టని పధకాలు పెట్టి అవి ప్రజలకు చేరే విధంగా చెసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిదని మన్యం టైగర్ ఆనంతబాబు అన్నారు.
ప్రతి మహిళ మీ భర్తలకు చెప్పండి  పట్టాలు నా పుట్టింటి వారిచ్చారని, నా అన్న జగన్ ఇచ్చాడని ప్రతి అక్క చెల్లి చెప్పండని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైసిపి ప్రభుత్వం ముందంజలో ఉందని అన్నారు
ఏళ్ళు పాలించిన పార్టీలు ప్రజలకు చేసింది ఏమీలేదని , నేడు జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఒరవలేక పోతున్నారని ఆరోపించారు.
ఇళ్ల పట్టాలు పొందిన వారికి ఒక్కో ఇంటికి  లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేపట్టుతున్నట్లు, వసర మైతే వ్యక్తి గత లోను కూడా బ్యాంకుల ద్వారా ఇంటిపై అందించే కార్యక్రమం తాము చేస్తున్నామని ఆనంతబాబు అన్నారు.  రాష్ట్రంలో 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
మండలంలో మిగిలిన పంచాయితిలో కూడా పట్టాలు పంపినిచేస్తామని పేర్కొన్నారు. మీగతా  పంచాయితిలలో తహశీల్ధార్ ద్వారా అందరికి పట్టాలిచ్చే కార్యక్రమం చేపడతాం. గతం లో అందని గిరిజనులకు అర్ ఓ యఫ్ అర్ పట్టాలు అందిస్తాంమని
ఇళ్ల నిర్మణం కూడా లబ్ధిదారులకు అనుకూలంగా మూడు రకాలుగా నిర్మాణం చేస్తాంమని వసర మైతే ప్రభుత్వమే ఇల్లు కట్టించి లబ్ధిదారులకు అందించనున్నట్లు ఆనంతబాబు పేర్కొన్నారు.
–  పట్టాలు పంచింది వీరికే
వి.అర్.పురలోని నాలుగు గ్రామ పంచాయితిలలో సుమారు 13 గ్రామాలకు సుమారు 1047 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది. అందులో గ్రామాల వారిగా
తెల్లవారిగూడెం 48, గుల్లేటివాడ88, కొక్కెరగూడెం, 41కుందులూరు42, , కొత్తపేట 33, వీర పాపనకుంట18, ములక పల్లి 28, కుంజావారిగూడెం 120,గొల్లగూడెం 26, వెంకమ్ పాలెం 40, బురుగువాడ 36, పెదమట్టపల్లి118
* అడుగడుగునా అంగ రక్షకులు
డిసిసిబి చైర్మన్ నంతబాబు, ఎమ్యెల్యే ధనలక్ష్మి లబ్ది ధ్రులకు అందించే ఇళ్ల పట్టాల , పొజిషన్ సర్టిఫికెట్ల కార్యక్రమంలో  చింతూరు సిఐ యువకుమార్, యస్ ఐ సురేషబాబు, స్థానిక యస్ ఐ లు చంటి, వెంకటేష్ తమ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పొలిస్తో బారి బందో బస్తు నిర్వహించారు.  నాయకుల అడుగు జడల్లో అడుగడుగునా అడవిలో బందో బస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ శ్రీధర్, ఎంపిడిఓ శ్రీనివాస్, యస్ ఐ చంటి, వెంకటేష్, వి.అర్.ఓలు, మండల పరిషత్ సెక్రెటరీలు భవాని, వి.అర్.ఓలు జోగరావు, మండలం రామకృష్ణ, దినేష్, నాగేశ్వరరావు , మండల వైసిపి నాయకులు  అందరూ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#