05:03 PM, 1 Monday March 2021

జగనన్న నవరత్నాలే సర్పంచ్ గా నన్ను గెలిపించాయి.

జగనన్న సంక్షేమ పథకాలతోనే నేను గెలిచాను
– పురుషోత్తపట్నం వైసిపి సర్పంచ్ బుద్దా.ఆదినారాయణ

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసిపి పార్టీ తరుపున పోటీ చేసిన తనను జగనన్న పథకాలే ప్రత్యర్ధులపై గెలిపించేలా చేశాయని వైసీపీ సర్పంచ్ బుద్దా.ఆదినారాయణ పేర్కొన్నారు. పురుషోత్తపట్నం పంచాయతీలో సర్పంచ్ గా బుద్దా.ఆదినారాయణ విజయం సాధించారు. సర్పంచ్ గా బుద్దా.ఆదినారాయణ విజయం సాధించి పంచాయితీ నుండి 7గురు వార్డు సభ్యులను సైతం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుద్దా.ఆదినారాయణ మాట్లాడుతూ తనకు ఘనమైన మెజార్టీ రావటానికి ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలే కారణమని అన్నారు. తనపై నమ్మకంతో సర్పంచ్ గా అవకాశం కల్పించిన జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ (బాబు) , ఎమ్మెల్యే ధనలక్ష్మి మరియు స్థానిక నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ ద్వారా నవరత్నాల్లో భాగంగా చదువు కోలేని తల్లిదండ్రుల పిల్లలకు – అమ్మఒడి పథకం ,కరోన విపత్తు సమయంలో ఇంటింటికీ రేషన్ , పింఛన్లు , బాత్రూం పథకాలు , జగనన్న ఇండ్లపట్టాలు ,ఆరోగ్యశ్రీ , 108 ,104 , రైతుల పట్ల పథకాలు , ఆటో అన్నలకు రూ 10 వేలు ఆర్థిక సహాయం ,కరోన వైద్యాన్ని అరోగ్యశ్రీలో చేర్చే కార్యక్రమం , పోడు భూములకు పట్టాలు , త్రాగు , సాగునీటి పథకాలు , ఇటువంటి ఎన్నో పథకాలే తమ గెలుపుకు కారణమని ఆయన తెలిపారు. తన వెన్నంటి ఉండి నడిపించిన నాయకులు జయచంద్రారెడ్డి , వీరారెడ్డి , దామెర్ల.రేవతి తదితర నాయకులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత.వైఎస్.రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో తన గెలుపుకు కృషి చేసిన నాయకులు తాండ్ర.నరసింహారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#