01:00 AM, 24 Sunday January 2021

జగనన్న పాలన దేశానికే ఆదర్శం

-పేదలకు అండగా ఉంటాం
– అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
– లబ్ధిదారులకు సంపర గ్రామంలో ఇంటి పట్టాల పంపిణీ

పెదపూడి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సొంతింటి కలను సాకారం చేసి మహోన్నత పథకాన్ని అమలు చేయడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం పెదపూడి మండలం, సంపర గ్రామంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి, శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మేలు చేయాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తున్నారన్నారు. అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల లో ఎంపిక చేశారన్నారు. పేదలకు నివాసయోగ్యమైన చోట స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మించి ఇస్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే ఇంత మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేశారన్నారు. అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు మోకా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రస్తుత ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం గ్రామ వైసిపి నాయకులు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల్ల కృష్ణారెడ్డి, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, పార్లమెంటరీ బీసీ సెల్ నాయకులు కేత శ్రీను, మండల నాయకులు తిరిబిశెట్టి ఆదినారాయణ, గాజింగి వెంకటరమణ, గున్నం వనిత, శ్రీ వెంకట్ రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, సత్తి భగవాన్ రెడ్డి, మండల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#