10:08 PM, 1 Monday March 2021

జియాలజీలో అవకాశాలను అందిపుచ్చుకోండి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జియాలజీలో ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొనే విధంగా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. జియాలజీలో అపార అనుభవం కలిగిన మొక్కా జగన్నాథరావు నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా విధులు నిర్వహిస్తూ ఆచార్యునిగా జియాలజీ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. శుక్రవారం యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల భవనంలోని జియాలజీ విభాగాన్ని సందర్శించిన ఆయన విద్యార్థులతో, అధ్యాపకులతో మమేకమైయ్యారు. దేశ విదేశాలలో జియాలజీ చదువుతున్న విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని, వాటిని అందింపుచ్చుకొనేందుకు అవసరమైన మార్గాలను సూచించారు. జియాలజీపై పట్టు సాధించడం వలన కలిగే ప్రయోజనాలను తద్వార లబించి అవకాశాలను క్షుణంగా వివరించారు. భూవనరులు, జియలాజికల్ టైమ్ స్కేల్, జియాలజీ అప్లికేషన్ తదితర అంశాల ఆయన బోధించారు. ఇన్విరాల్మెంట్ జియాలజీస్ట్, మైనింగ్ జియాలజీస్ట్, పెట్రోలియం జియాలజీస్ట్ మధ్య వ్యత్యాసాలను తెలియజేసారు. విద్యార్థులంతా ప్రతీరోజు తమతమ పాఠ్యాంశాలలో నుండి కొత్త విషయాలను అధ్యాయణం చేసి నిద్రపోవాలనే నిబంధనను పెట్టుకొని పాఠ్యాంశాలపై పట్టుసాధించాలన్నారు. పాఠ్యాంశాల బోధన అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి దానిలో సరైన సమాదానాలు ఇచ్చిన విద్యార్థులకు పుస్తకాలను బహుకరించి ప్రోత్సహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కాకుండా ప్రముఖ జియాలజీ ఆచార్యులుగా విద్యార్థులకు, అధ్యాపకులకు క్లాస్ తీసుకున్న మొక్కా జగన్నాథరావును జియాలజీ విభాగాధిపతి డా.కె.నూకరత్నం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వై.శ్రీనివాసరావు, డా.కె.వి.స్వామి, డా.కె.సామ్యుల్ పీటర్ విభాగాధ్యాపకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#