01:03 AM, 24 Sunday January 2021

జిల్లాలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సజావుగా సాగుతోంది

– సీఎం జగన్ తో కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద జిల్లాలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సజావుగా సాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 20వ తేదీ నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, జగనన్న అమ్మ ఒడి, భూ సేకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, కాకినాడ కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్లు డా.జి లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి రాజకుమారి తదితరులు హాజరయ్యారు. జిల్లాలో ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రణాళిక ప్రకారం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతోందని కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లాలో లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు అధిక సంఖ్యలో లేఔట్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జడ్పీ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ, డీఆర్ డీఎ పీడీ వై.హరిహరనాథ్, డీపీవో ఎస్వీ నాగేశ్వర్ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#