02:26 AM, 4 Thursday March 2021

జీడిగుప్ప జనసేన సర్పంచ్ అభ్యర్థి గా మోహన్

– గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలోని మారుమూల గ్రామ పంచాయితీ అయిన జీడిగుప్ప పంచాయితిలో రెండవ రోజు నామినేషన్ ల పర్వం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో జీడిగుప్ప గ్రామ పంచాయితీ నుండి జనసేన సర్పంచ్ అభ్యర్థిగా కోట్ల మోహన్ రెడ్డి నామినేషన్ ఆదివారం వేశారు. ఆయనను శ్రీనివాస్ బలపరుస్తూ ఈ నామినేషన్ వెయ్యడం జరిగింది. ఈ సంధర్బంగా మోహన్ రెడ్డి, శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం ప్రతి పార్టీ ఆధిపత్యం కోసం పాకులాడుతుందని అలా కాకుండా  గ్రామంలో ఉన్న ప్రజలు సమస్యలు పరిష్కరించే విధంగా గెలిచిన సర్పంచ్లు ఆదిశగా ఉండాలని అన్నారు. సర్పంచిగా గెలిచి ఇతరుల చేతుల్లో కీలు బొమ్మలా కాకుండా ప్రజల పక్షాన కష్టపడి పనిచేయాలని కోరారు . జనసేన కోరుకునేది ఒక్కటేనని ప్రజల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తుందని , ప్రజలకు ఎల్లవేళలా దగ్గరగా ఉండి వారి పక్షాన పనిచేస్తుందని అన్నారు. ఆదివారం తన సర్పంచ్ అభ్యర్థి కోట్ల మోహన్ రెడ్డి ని బలపరుస్తో నామినేషన్ వెయ్యడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. జనసేన పార్టీ కార్యకర్తలు, జీడిగుప్ప ప్రజలు అందరూ తమ అభ్యర్థి అయిన మోహన్ కి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. చదువుకున్న వ్యక్తి, విజ్ఞ వంతుడు కావడం వలన అందరి సమస్యలను అర్ధం చేసుకుని సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులను సంప్రదించి అందరికి న్యాయం చేయగలరని కోరారు.  గ్రామ పంచాయితీకి వచ్చిన నిధులను సక్రమంగా పంచాయితిలో  ఖర్చు చేసి గ్రామాల అభివృద్ధికి సేవలు చేస్తామని అన్నారు. ఈ సారి తన అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#