02:09 AM, 24 Sunday January 2021

టిడిపి దేవాలయాలపై చేస్తున్న కుట్ర రాజకీయాలకు స్వస్తి పలకాలి

– అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు మోకా సూరిబాబు

పెదపూడి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

దేవాలయాల పై దాడులు విషయంలో టిడిపి చేస్తున్న కుట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు వైసీపీ నాయకులు మెకా సూరిబాబు దుయ్యబట్టారు. పెదపూడి మండలం, సంపర గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మోకా సూరిబాబు మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష టిడిపి విధ్వంస రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అప్రదిస్ట తేవాలనే దురుద్దేశంతో దేవాలయాలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. దేవుడు జోలికి వెళ్తే ఆ దేవుడే తగిన శాస్తి చేస్తాడని, టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పెద్ద, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#