02:33 AM, 20 Wednesday January 2021

టీడీపీ నేత ప్రొద్దుటూరు చేనేత నాయకులు నందం సుబ్బయ్య హత్య అమానుషం నరసరావుపేట టీడిపి ఇంచార్జి

– డా||చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డా|| చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేత పార్టీ అధికార ప్రతినిధి చేనేత నాయకులు నందం సుబ్బయ్య ను ప్రొద్దుటూరు లో దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికీ బీసీ వర్గాల మీద ప్రభుత్వం చేస్తున్న దాడి.రాష్ట్రంలో వైసీపీ నేతలు ఆగడాలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు ఈరోజు సుబ్బయ్య హత్య ప్రత్యక్ష నిదర్శనం. నిన్న వెలగపూడి లో దళిత మహిళ ను అన్యాయంగా గొడవలు సృష్టించి పొట్టన పెట్టుకున్నారు. దానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ నందిగాం సురేష్ బాధ్యత వహించాలి.అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం దుర్మార్గం.వైసీపీ నేతల,అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా? సీఎం సొంత జిల్లాలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? వైసీపీ నాయకుల అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చాడని సుబ్బయ్య చంపారు.ఈ ప్రభుత్వంలో పౌరులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? మీ అరాచకాలపై ప్రజలు తొందర్లోనే తిరుగుబాటు చేస్తారన్నారు.ఈ సమావేశంలో శేఖర్,రఫీ,మీరావలి పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#