09:00 AM, 2 Tuesday March 2021

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవమానపరిచిన వారిని వెంటనే శిక్షించాలి

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండతో అవమానపరిచిన వారిని వెంటనే గాలించి పట్టుకోవాలనితూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులుజుత్తు క. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చింతలపూడి పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన వారిని పట్టుకోవాలని వారు ఎంతటి వారైనా పోలీసు వారు నిష్పక్షపాతంగా వ్యవహరించి వారి వెనకాల ఎంతటి పెద్ద నాయకులు ఉన్న వారిని వదిలేది లేదని అన్నారు.అవసరమైతే రాష్ట్ర దళిత నాయకులు అందరూ ఏకమై పోరాడి మరల ఇంకెప్పుడు ఇటువంటి దుర్మార్గమైన పనులకు పూనుకోకుండా  ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ,అవసరమైతే స్క్వాడ్ డాగ్ రప్పించి వారు ఎక్కడ దాక్కున్న పోలీసు వారు కష్టపడి వారిని పట్టుకోవాలని, లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటే తెలియని వారు లేరని ఆయన ప్రపంచ మేధావి ,రాజ్యాంగ సృష్టికర్త ,ఈ రాజ్యాంగం అనుభవిస్తూ  ఈరోజు అనుభవిస్తున్న పదవులను అనుభవిస్తూ ముసుగు దొంగ లాగా వ్యవహరిస్తున్నారని ఆయనను అవమానపరిచిన వారుఎంతటి వారైనా క్షమించేది లేదని వారికి కఠినమైన శిక్ష పడే అంతవరకూ మా దళిత సంఘాలు అన్ని పోరాడతాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఎటు వెళ్లిపోతుందో అర్థం కాకుండా ఉందని ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుండి కూడా దళితులపైన అలాగే అంబేద్కర్ విగ్రహాల పైన చేతకాని దద్దమ్మలు వ్యవహరిస్తున్నారని, అటువంటి దుర్మార్గులను ఆటవిడుపుగా తీసుకొని ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుందని దళితులపై ముసలి కన్నీరు కారుస్తూ ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటున్నారని , అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పనికి ఉసిగొల్పిన వారిని విడిచి పెట్టినట్లయితే ఇలాంటి దుండగులు ఇంకా పెట్రేగి పోతున్నారు . అలాంటివారికి భయం లేదు అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు సరైనటువంటి వారికి కఠినమైన శిక్షలు లేకపోవడమేనని రాజ్యాంగం లో ఉన్నటువంటి చట్టాలను గట్టిగా పాటించినట్లయితే అటువంటి దుర్మార్గమైన పనికి ముందుకు రారని ,వీరి వెనకాల ఎవరో పెద్ద నాయకులు ఉండి నడిపిస్తున్నారని ,దీనివలన అమాయకులైన అటువంటివారు బలే అవుతారని తెలియజేస్తూ ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని  వెంటనే పట్టుకుని కఠినమైన  శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#