04:08 AM, 2 Tuesday March 2021

డీపీఆర్వో నారాయణ రెడ్డి బదిలీ…

ప్రకాశం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఒంగోలు సమాచార శాఖ లో ఏడి నారాయణ రెడ్డిపై వచ్చిన అభియోగాలు పై విజయవాడ కమీషనర్ ఆఫీసు నుండి వచ్చిన అధికారులు ఎక్వయిరీ చేసి మహిళలపై వేధింపులు నిజమని నిర్దారణ చేసి క్రమశిక్షణ చర్యలు నిమిత్తం ఏడి నారాయణ రెడ్డిని గుంటూరుకు బదిలీ చేసినట్లు విజయవాడ సమాచార కమీషనర్ ఒంగోలు సమాచార కార్యాలయానికి ఉత్తర్వులు జారీచేసినట్లు కమీషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు..ఏడి నారాయణ రెడ్డి బదిలీ పై ఓ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ హస్తం ఉన్నట్లు సమాచారం కురిచేడు ప్రాంతానికి చెందిన ఓ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జేడీకి నవంబర్ నెలలోనే జర్నలిస్టుల అక్రిడేషన్ నేమ్ చేంజింగ్ విషయంలో ఫోన్ చేసి జర్నలిస్ట్ లపై కనీస మర్యాద లేకుండా అధికారిని అని మరిచి రాజకీయ నాయకుడు వలె ఆవేశంతో మాట్లాడటం తో ఆ యూనియన్ నాయకుడు కమిషనర్, జేడీకి ఫోన్ చేసి వివరించడంతో అప్పుడే బదిలీ చేస్తామని చెప్పడం ఆ తరువాత మహిళా ఉద్యోగులు వేధింపులపై కమీషనర్ కార్యాలయంలో కంప్లైంట్ చేయడం ఆ తరువాత కమిటీని నియమించడం ఆ కమిటీలో జె.డి కస్తూరి, ఏడి లీలావతిలను నియమించి ఒంగోలులో ఎంక్వయిరీ చేయించారు ఆ ఎంక్వయిరీలో మహిళలపై వేధింపులు నిజమేనని నిర్ధారించారు. ఆ ఎంక్వయిరీ సమయంలోనే ఓ జర్నలిస్టు యూనియన్ నాయకుడు రాష్ట్ర సెక్రటరీ ఫోన్ చేసి జేడీకి గతంలో జర్నలిస్టులపై అతని వ్యవహారశైలి గురించి క్షుణ్ణంగా వివరించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#