04:31 AM, 3 Wednesday March 2021

ఢిల్లీలో రైతులు పోరాటానికి మద్దతుగా నిరసన దీక్ష

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఢిల్లీలో రైతుల పోరాటాలకు మద్దత్తుగా,గాంధీజీ వర్ధంతి పురస్కరించుకుని ఏఐకెఎస్ సిసి పిలుపు మేరకు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ లో శనివారం వామపక్షాలు, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా గాంధీజి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపిరైతు సంఘం నాయకులు టి. నాగేశ్వరరావు, సీఐటీయూ జిల్లా సినీయర్ నాయకులు దువ్వా శేషబాబ్జి లు మాట్లాడుతూ ఢిల్లీ రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రైతుల పై తప్పుడు కేసులు, లాఠీచార్జీలు, బాష్పవాయు ప్రయోగం లాంటి అనేక పాశవిక కార్యక్రమలకు పాల్పడుతున్నప్పటికీ రైతు ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష, రైతు, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#