04:57 AM, 4 Thursday March 2021

ఢిల్లీ రైతాంగ పోరాటం పై మోడీ ప్రభుత్వం నిర్బంధాన్ని నిరసిస్తూ హైవే బంద్

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మోడీ- బిజెపి ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ రంగ చట్టాలను రద్దు చేయాలని ఉత్తర భారత రైతాంగం ఢిల్లీ పరిసరాల్లో జరుపుతున్న ఆందోళనలపై నిర్బంధం, దుష్ప్రచారాన్ని నిరసిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రైతు -కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేటలో హైవే బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు- కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొండా దుర్గారావు మాట్లాడుతూ అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో కీలుబొమ్మగా మారిన మోడీ బిజెపి ప్రభుత్వం రెండు నెలలుగా జరుపుతున్న ఆందోళన మీద జరుపుతున్న నిర్బంధాన్ని తక్షణం నిలిపివేయాలని మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AIFTU జిల్లా నాయకులు R సతీష్, PDSU విజృంభణ జిల్లా కార్యదర్శి k, సతీష్, డాన్ శీను ,సత్తిబాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#