10:08 AM, 16 Saturday January 2021

తండ్రి తాతలు ఇవ్వలేని ఆస్తిని ముఖ్యమంత్రి ఇస్తున్నారు..ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలో గురువారం కానవరం లో జరిగిన కార్యక్రంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గున్నారు
రూ 2.63 కోట్లు తో కానవరం గ్రామంలో అభివృద్ధి పనులు చేసాము.
తండ్రి తాతలు ఇవ్వలేని ఆస్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని రాజానగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు రాజానగరం మండలం కానవరం గ్రామంలో నవరత్నాలు అందరికి ఇల్లు  కార్యక్రమంలో భాగంగా 252 మందికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే
 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ రాజశ్రీ హాజరై లబ్ధిదారులకు పసుపు కుంకుమ జాకెట్ ముక్క పండ్లు తో కలిపి ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యాయని తెలిపారు. రాజనగరం నియోజకవర్గం పరిధిలో 19,100 మందికి  ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు.
కానవరం గ్రామంలో గత పదేళ్ళకాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కానవరం గ్రామంలో ఖర్చుపెట్టింది కేవలం కేవలం అక్షరాల 56 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలోనే 2 కోట్లు 63 లక్షల 43 వేల రూపాయలు అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ గ్రామానికి ఖర్చు చేయడం జరిగిందన్నారు.
మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు మహిళల పేరిట మీదనే అమలు చేస్తున్నాన్నారు.
వైఎస్ఆర్ ఆసరా, వైయస్సార్ చేయూత, అమ్మ ఒడి, వంటి పథకాలు మహిళలకు మంజూరు చేస్తున్నారని తెలిపారు.
మహిళల రక్షణ కోసం దిశా వంటి చట్టం తెచ్చారని, నామినేటెడ్ పదవుల లో మహిళలకు కోసం 50 శాతం రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.
ఇళ్ల స్థలాలు కేటాయించి చేతులు దులుపుకోకుండా, మోడల్ కాలనీ నిర్మించి సిసి రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ సౌకర్యం మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.
టిడిపి ప్రభుత్వంలో అంగుళం భూమి కూడా నిరుపేదలకు ఇవ్వలేదని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర లో ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రజా ప్రతినిధులు, అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరగకుండా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 90 రోజులనే ఇళ్ల పట్టా కేటాయించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని రకాల చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు.
అనంతరం కానవరం గ్రామంలో 21 లక్షల 80 వేల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తంత్రవాహి బసిబాబు,యస్ .వీరవెంకటరావు,బొడ్డివెంకన్న, శివరామకృష్ణ, యస్ .వెంక్కన్న,యస్.సత్తిబాబు(యస్.యస్)కురికిరి.ప్రసాద్,  దూలం పెద్ద, మందారపు వీర్రాజు,  శ్రీ రామకృష్ణ,రాజు, తోకాడ నాని బాబు, తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#