04:07 AM, 2 Tuesday March 2021

తస్మాత్ జాగ్రత్త చట్టం ముందు అందరూ సమానమే

● ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి యస్.ఐ గుణశేఖర్

కూనవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఎన్నికల నియమావళి పాటిస్తూ ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కూనవరం మండలం ఎస్ఐ గుణశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం కూనవరం పిఎస్ పరిధిలోని కాచవరం, పోచవరం పలు పంచాయతీల పోలింగ్ స్టేషన్లను పరిశీలించి అక్కడ ప్రజలకు ఎన్నికల నియమావళి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో గ్రూపు తగాదాలతో  జీవితాలు నాశనం చేసుకోవద్దని, అవాంచనియా సంఘటనలకు దూరంగా ఉండాలని సూచించారు. అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఏపంచాయతీ నామినేషన్ లు ఏ పంచాయితీలో స్వీకరిస్తారో వివరించారు. ఎన్నికల సమయాన్ని శాంతిభద్రతల దృశ్య మావోనిస్టు ప్రభావిత  ప్రాంతాలైన ఏజెన్సీలో కుదించడం జరిగిందని ఉదయం 6:30 గంటల నుండి  ప్రారంభమై మధ్యాహ్నం 1:30 గంటలకు పోలింగ్ ముగిస్తారని రెండు గంటల నుండి కౌంటింగ్ మొదలు పెడతారని , ఎంతటి వారైనా సరే పోలింగ్ బూతుల కు 100 మీటర్ల దూరంలో వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను బెదిరింటం, ప్రలోభాలకు గురి చెయ్యడం గాని చట్ట రీత్యా విరుద్ధంమని, పోలీసులు లకు సమాచారం ఇచ్చేముందు ఒకింత నిజ నిర్ధారణ చేసుకొని సమాచారం ఇవ్వాలని తెలిపారు. డబ్బు మద్యం ఇతరేతర వస్తువులను ఆశ చూపించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే మోడల్ కండక్ట్ కోడ్  ఆఫ్ కండెక్ట్  రూల్స్ ప్రకారం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని కోర్టు లో హాజరుపరుస్తాం. తదుపరి వారి పై ఎప్పుడు ఎలక్షన్స్ జరిగిన బైండోవేర్ కేసులు నమోదు చేస్తామన్నారు.. ఎలక్షన్స్ ప్రచారం చేసే అభ్యర్థి వాహన ప్రచార అనుమతి కొరకు యం.పి.డి.ఒ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలని, మైక్ పరిమిషన్ కొరకు డి.యస్.పి వారి కార్యాలయంలో అనుమతి తీసుకోవాల్సి వుంటుందాని వివరించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#