04:51 AM, 3 Wednesday March 2021

తిమ్మాపురం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి గా బెజవాడ నామినేషన్…

– బ్రహ్మ రధం పట్టిన గ్రామస్థులు..
– గోమాతకు నమస్కరించి, పాదయాత్ర గా నామినేషన్ వేసిన బెజవాడ..

కాకినాడ రూరల్, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం తిమ్మాపురం గ్రామం వైఎస్ఆర్సిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బెజవాడ వీరవెంకట సత్యనారాయణ తన అనుచర వర్గం 14 మంది వార్డు మెంబర్ల అభ్యర్థులతో శనివారం మంత్రి కన్నబాబు తండ్రి వైయస్ఆర్సిపి సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ తో కలిసి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ముహూర్తం ప్రకారం గోమాతలకు స్వయంగా గడ్డి కోసి ఆవులకు వేసి నమస్కరించి ర్యాలీగా తన నివాసం నుండి బయలుదేరి వెళ్లి తిమ్మాపురం పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఆయనకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.బెజవాడ వెంట గ్రామ పెద్ద బెజవాడ చందర్రావు వైసిపి నాయకులు గాంజా సత్తిబాబు, గుండు బిల్లి శ్రీను చంద్ర, విత్తనాల రమణ, విత్తనాల అప్పారావు, మాచవరపు సత్యనారాయణ, కాళ్ళ చంటి, బెజవాడ యూత్, సాంబ, అంబేత్కర్ యూత్, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#