05:07 PM, 3 Wednesday March 2021

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి

నెల్లిపాకలో తెదేపా సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం
– జిల్లా నాయకులు కిలారి.వెంకటేశ్వరరావు
– గ్రామ కమిటీ అధ్యక్షులు పుట్టి.రమేష్

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

స్థానిక పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకోవాలని జిల్లా నాయకులు కిలారి.వెంకటేశ్వరరావు , నెల్లిపాక తెలుగుదేశం గ్రామకమిటి అధ్యక్షుడు పుట్టి.రమేష్ పార్టీ కార్యకర్తలకు , గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని నెల్లిపాక గ్రామంలో శనివారం తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి కొర్స.భద్రమ్మ తరుపున వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో తెలుగుదేశం సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు మంచం! అందుకే జై మంచం..జైజై మంచం అంటూ అభ్యర్థి తరుపున పార్టీ నాయకులు ప్రచారం ఊదరగొట్టారు. ముందుగా నెల్లిపాక ప్రధాన కూడలిలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో సర్పంచ్ గెలుపు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కిలారి.వెంకటేశ్వరరావు , పుట్టి.రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడా భయపడకుండా గ్రామంలో అభివృద్ధి , పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు వారు స్పష్టంచేశారు. రాజ్యాంగ వ్యవస్థలు పని చేయకుండా , ముఖ్యమంత్రి మాటే ఒక శాసనంలా పని చేయాలనే ఆలోచనతో రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. కావున తెలుగుదేశం పార్టీని గుర్తించి గ్రామస్తులు ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు నలజాల.శ్రీకాంత్ , రెడ్డి రామకృష్ణ , కిలారి.శంకర్ , మందలపు.రామారావు , ఊకె.శంకర్ , సరియం.బొజ్జి , మానికెల.వీరస్వామి , వంగవీటి సూర్యనారాయణ , కిలారి జోగారావు , ఎస్.కె.మౌలా , వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#