04:01 PM, 3 Wednesday March 2021

తైక్వాండో పోటీల పోస్టర్ ఆవిష్కరణ

◘ ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
◘ హాజరైన కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి

శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 31న నిర్వహిస్తున్న 21వ జిల్లా స్థాయి ఓపెన్ తైక్వాండో పోటీలు-2021కి సంబందించిన పోస్టర్లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ బుదవారం సాయంత్రం ఆవిష్కరించారు.ధర్మాన కృష్ణదాస్ తో పాటు కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి ,డిసిఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ,రాష్ట్ర కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు,వైకాపా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్ ,రాష్ట్ర కళింగకోమటి సంఘం అధ్యక్షుడు కోణార్క్ శ్రీను తదితరులంతా కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ ,కిల్లి కృపారాణిలు ఆకాంక్షించారు.క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కూడా వారు సూచించారు.జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా పోటీలు నిర్వహించాలని వారు ఆశాభావం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ చల్లా అలివేలుమంగ,మాజీ కౌన్సిలర్ ఎం.ఎ.రఫి,సురంగి మోహన్ రావు,వైకాపా యువజన నేత సిరాజుద్దీన్ ,మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ మహాలక్ష్మి,టి.కామేశ్వరి,సుగుణారెడ్డి,గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు.అదేవిదంగా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను,ఏపిడబ్య్లుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ ,పోటీల నిర్వాహకులు సుధీర్ వర్మ,వైశ్యరాజు మోహన్ ,తైక్వాండో గౌతమ్ ,తైక్వాండో నవీన్ ,పెయ్యల చంటి,మురళీ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#