02:16 AM, 24 Sunday January 2021

దేవాలయాలపై,చర్చిలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి.

చాగల్లు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొన్ని అసాంఘిక శక్తులు పనిచేస్తున్నాయని ఖచ్చితంగా అణచివేయాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను గురువారం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మీడియా వింగ్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల సాల్మన్ దొర అభ్యర్ధించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కలవకూరు గ్రామంలో నవరత్నాల్లో భాగమైనా 30 లక్షల మంది నిరుపేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ పర్యటనలో భాగంగా ఎన్.సీ.సీ, క్రిస్టియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత దృష్టికి క్రైస్తవుల పట్ల మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు కించపరుస్తు మాట్లాడిన మాటలు, అసత్యాలను తీసుకువచ్చారు,హిందూ,క్రిష్టియన్ సోదరులు కలసి మెలసి ఉన్నారని,రాజకీయ కోణంలో వైయస్ జగన్ నేతృత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాలపై,చర్చీలపై దాడులకు పాల్పడుతున్నారనీ, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా  వారిని కఠినంగా శిక్షించాలనీ కోరారు.అదే విధంగా క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తినేటట్టు, మత విద్వేషాలు రెచ్చగొట్టేట్లు మాట్లాడినా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.చర్చి నిర్మాణాల అనుమతులు వేగవంతం చేయాలని,అనుమతులు సచివాలయంలో ఇచ్చేటట్ట్లు,శ్మశానవాటిక స్థలాల కేటాయింపు చేయాలనీ కోరారు. దైవసేవకులు వాడపల్లి జాన్ ఇశ్రాయేలు,గెడ్డం శామ్యూల్ జాన్సన్,గ్రంధి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#