02:20 AM, 8 Monday March 2021

దేశంలో ఇంత బారీ ఎత్తున పట్టాలు పంపిణి చేయడం ఇదే ప్రప్రధమం

◘ పెదపూడి లో ఇళ్ల పట్టాల పంపిణీ లో
– అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి

పెదపూడి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంగళవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇంత బారీ ఎత్తున పట్టాలు పంపిణి చేయడం ఇదే ప్రప్రధమమని, తనకు 55 వేలు మెజారిటి ఇచ్చి రాష్ట్రంలోనే 4 వ వ్యక్తిగా అతిపెద్ద మెజారిటితో గెలిపించిన ప్రజలకు తన చేతులమీదుగా పట్టాలు పంపిణి చెయడం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు మోకా సూరిబాబు, వైసీపీ నాయకులు సమ్మంగి దుర్గ ప్రసాద్, ఈదేటి రాంబాబు, కోరా వీర్రాజుచౌదరి, గార్లపాటి అశోక్ కుమార్, అందుగుల అబ్బు, తిప్పన వెంకటరత్నం, మండల కన్వీనర్ గాజంగి వెంకటరమణ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#