05:40 PM, 28 Thursday January 2021

నన్నయ ప్రగతికి పాటుపడదాం

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఉభయగోదావరి జిల్లాలకు విద్యాపరంగా తలమాణికమైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రగతికి సమష్టిగా పాటుపడాలని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. “2020 సంవత్సరంలో విశ్వవిద్యాలయ పురోగతిపై సమీక్ష – 2021లో విద్యాపరమైన అభివృద్ధి వ్యూహలు మరియు లక్ష్యాలు” అనే అంశంపై శనివారం విశ్వవిద్యాలయ కన్వెన్షన్ సెంటర్ లో వర్క్ షాపును నిర్వహించారు. ఉపకులపతిగా వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా నన్నయ వాణి పత్రిక ప్రచురించిన వార్షిక ప్రగతి నివేదిక సంచికను మరియు విశ్వవిద్యాలయ నివేదిక పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాలలోని అన్ని రంగాలు సంక్షోభంలోకి దిగిపోయాయని దాని ప్రభావం విద్యా రంగంపై కూడా పడిందని అన్నారు. ఇటివంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ వైపు నడిపించి విజ్ఞాన విజయాలను సాధించామని చెప్పారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా జాతీయ అంతర్జాతీయ సదస్సులను నిర్వహించడం, ఈ-క్లాసుల నిర్వహణ, జెస్టోర్ జెగేట్ వసతులు కల్పించడం, ఈ-కంటెంట్ ను అభివృద్ధి చేయడం వంటి సాంకేతిక కార్యక్రమాలతో మంచి ఫలితాలను చూసామన్నారు. 450 అనుబంధ కళాశాలలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉన్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో కోవిడ్ సమయంలో పరీక్షల నిర్వహణ నిజమైన ఛాలెంజ్ అని దానిని సమర్థవంతంగా నిర్వహించామని చెప్పారు. కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ పక్కా ప్రణాళికతో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ప్రశాంతంగా డిగ్రీ పీజీ పరీక్షలు నిర్వహించామన్నారు. విశ్వవిద్యాలయ నాణ్యత ప్రమాణాలను పరిగణించే ఐ.ఎస్.ఓ సర్టిఫికెట్టును 2020 నాటికి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకొని ఐ.ఎస్.ఓ గుర్తింపును సాధించామని చెప్పారు. 2021 సంవత్సరంలో నాక్ గుర్తింపు సాధనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞానవంతులతో ఉన్న సంబంధాలను విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం ఉపయోగించాలని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎంత అభివృద్ధి సాధించామో కోవిడ్ అనంతరం అంతకు మించిన అభివృద్ధిని సాధించాలని తెలియజేసారు. విశ్వవిద్యాలయమంతా ఒక కుటుంబంగా ముందుకు సాగాలని, ఈగో లాను పక్కన పెట్టి విశ్వవిద్యాలయ ప్రగతికి అందరూ పాటుపడాలన్నారు. రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు మాట్లాడుతూ ఏడాది కాలంలో విశ్వవిద్యాలయాన్ని విద్యాపరంగా, పరిపాలన పరంగా ముందుకు నడింపించిన వీసీ జగన్నాథరావుకు అభినందనలు తెలియజేసారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ అభివృద్ధి, సమర్థవంతంగా పరీక్షల నిర్వహణ, ఐ.ఎస్.ఓ గుర్తింపును సాధించడంతో పాటు నన్నయలో ప్రప్రథమంగా ఎన్.ఎస్.క్యూ.ఎఫ్ యూజీసీ కోర్సుల ఏర్పాటు, ప్రాంగణంలో పర్యావరణ అభివృద్ధి, ఆన్ లైన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్, విద్యార్థులకు స్టడీ రూమ్ ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. భవిష్యత్ లో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు సిబ్బంది అంతా పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలియజేసారు. కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్ ల ప్రత్యేకాధికారులు, ప్రిన్సిపాల్స్, డీన్స్, ఆయా శాఖల అధికారులు ఈ ఏడాది సాధించిన ప్రగతి నివేదికలను తెలియజేసారు. అనంతరం అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది వీసీ ని సన్మానించి అభినందలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్లు ఆచార్య కొట్టి శ్రీరమేష్, ఆచార్య టి.అశోక్, డా.బి.జగన్మోహనరెడ్డి, పిన్సిపాల్స్ ఆచార్య ఎస్.టేకి, డా.కె.రమణేశ్వరి డా.వి.పెర్సిస్, డీన్స్ డా.ఎ.మట్టారెడ్డి, డా.ఎం.కమలకుమారి, డైరెక్టర్ ఆఫ్ ఆఫ్ అడ్మిషన్స్ డా.డి.జ్యోతిర్మయి, ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డా.బి.కెజియారాణి, యూజీసీ కోఆర్డినేటర్ డా.పి.విజయనిర్మల, ఫైనాన్స్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#