02:02 AM, 8 Monday March 2021

నవభారత్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కాకినాడ రూరల్, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కాకినాడ నగరం లోగల నవ భారత్ పబ్లిక్ స్కూల్ 10 వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక గైగోలుపాడులో మంగళ వారం నిర్వహించారు. సుమారు 50 మంది దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొని ఆనాటి ఉపాద్యాయులను సన్మానించారు. ముందుగా ఆనాటి ప్రధాన ఉపాద్యాయురాలు స్వర్గీయ జిఎంఎజే  పుష్పంకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులంతా గత స్మృతులను స్మరించుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కలిసి తమను సన్మానించి, మళ్లీ గత అనుభవాలను గుర్తు చేసి అందరినీ ఇలా కలిపినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కోమటి శ్రీను, రామ్ కుమార్, కెంగం హారి, కంచి శ్రీను,గంగుమల్ల రమేష్, నల్ల శ్రీనివాస్, శివరామ రాజు, గుర్రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#