రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
నాటుసారా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు రాయవరం ఎస్సై పి వి ఎస్ ఎస్ సురేష్ స్థానిక విలేకరులకు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెదురుపాక గ్రామానికి చెందిన కొండ్రు చిన్న అనే వ్యక్తి మూడు లీటర్ల నాటుసారాను విక్రయిస్తున్న ఇచ్చిన సమాచారం మేరకు రాయవరం పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద మూడు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై స్థానిక విలేకరులకు తెలిపారు.