02:11 PM, 2 Tuesday March 2021

నామినేషన్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఊరుకోం

– చింతూరు డిఎస్పీ ఎస్.కె.ఖాదర్ బాషా హెచ్చరిక
– 5 జోన్లలోని నామినేషన్ కేంద్రాలు పరిశీలన

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారం మొదలుకావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద విధి నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై ఎటపాక పోలీసులకు చింతూరు డిఎస్పీ ఎస్.కె.ఖాదర్ బాషా దిశానిర్దేశం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా చూస్తూ ఊరుకునేది లేదని చింతూరు డిఎస్పీ ఎస్.కె.ఖాదర్ బాషా హెచ్చరించారు. మూడవ దశ పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏజెన్సీ ప్రాంతంలో శనివారం మొదలు కావడంతో మండలాన్ని 5 జోన్లుగా విభజించి ఏర్పాటు చేసిన ఎటపాక , ఎర్రగుంట , నెల్లిపాక , తోటపల్లి , గౌరిదేవిపేటల్లోని నామినేషన్ కేంద్రాలను చింతూరు డిఎస్పీ ఎస్.కె.ఖాదర్ బాషా , ఎటపాక సీఐ గీతారామకృష్ణతో కలిసి పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణ మొదటి రోజు మండలంలో కోలాహలంగా సాగింది. మండలంలో గల 21 గ్రామ పంచాయతీలలో 190 వార్డులకు గానూ పాఠశాలలు , గ్రామ పంచాయితీల వద్ద ఏర్పాటు చేసిన 5 జోన్లలో నామినేషన్ కేంద్రాలలో స్టేజ్-1 అధికారులు అభ్యర్ధుల నుండి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. 5 నామినేషన్ జోన్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటపాక ఎస్సైలు జ్వాలాసాగర్ , చినబాబు ఆధ్వర్యంలో సి/39 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి , అనంతరం ప్రత్యేక వాహనాల్లో 5 జోన్లను పరిశీలన చేశారు. అలాగే చింతూరు డిఎస్పీ ఖాదర్ బాషా , సీఐ గీతారామకృష్ణ ఉదయం నుండి 5 జోన్లను పరిశీలన చేశారు. తప్పనిసరిగా అభ్యర్థులతోపాటు వారిని బలపరిచిన వారు కూడా ఎన్నికల నిబంధనలు పాటించాలని డిఎస్పీ బాషా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#