03:52 AM, 2 Tuesday March 2021

నామినేషన్ కేంద్రాల్లో స్టేజ్ 1 ఆపిసర్లు వీరే

– కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో అప్రమత్తం

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలో జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికలకు మూడు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్టేజ్ 1 ఆఫీసర్ లుగా నియమించడం జరిగింది. అందులో ఎంపిడిఓ మీటింగ్ కార్యాలయ ఆవరణలో  సిహెచ్ భవాని శంకర్  స్టేజ్ 1 ఆఫీసర్ గా ఉన్నారు. ఈ పరిధిలో వడ్డిగూడెం, రేఖపల్లి, రాజుపేట, శ్రీరామగిరి పంచాయితీలు సర్పంచుకు పోటీచేసే అభ్యర్థులు వార్డు మెంబర్లు ఇక్కడ నామినేషన్ లు వెయ్యవలసి ఉన్నది. అదే విధంగా ఏవో కార్యాలయంలో స్టేజ్ 1 ఆఫీసర్ గా సిడిపిఓ శంషాద్ బేగం ఉన్నారు. తుమ్మిలేరు, జీడిగుప్ప, పెద్ద మట్టపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్, వార్డు మెంబర్లు నామినేషన్ లు వెయ్యవలసి ఉంటది.  సోముల గూడెం లో ఆర్. ఈశ్వర్రావు (మండల వ్యవసాయాధికారి) స్టేజ్ 1 ఆఫీసర్ గా ఉన్నారు. ఇక్కడ రామవరం, చిన మట్టపల్లి, ములకన పల్లి, కుందులూరు గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు నామినేషన్ లు వెయ్యవలసి ఉన్నది. తహశీల్ధార్ ఎన్. శ్రీధర్, ఎంపిడిఓ శ్రీనివాస్ సూపర్ వైజర్లుగా ఉంటారు.
నామినేషన్ కేంద్రాల వద్ద బారి బందోబస్ట్
 శనివారం ప్రారంభ మైన నామినేషన్ కేంద్రాల వద్ద స్థానిక యస్. ఐ లు చంటి వెంకటేష్  తమ పోలిష్ సిబ్బందితో బారి బందో  బస్తు నిర్వహించారు. బయట వ్యక్తులను నామినేషన్ కేంద్రాల సమీపంలోకి రనివ్వ లేదు. కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రజాలుండే విధంగా తగు చర్యలు తీసుకున్నారు. ఆ ప్రాంతాలలో సంచరిస్తున్న వారిపై డేగ కాన్ని వేసి ఎటువంటి వ్యక్తులకు లోపటికి ప్రవేశం కల్పించలేదు. ఎప్పటికప్పుడి నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితులను తమ పై అధికారులకు తెలియ జేస్తూ ఆ చుట్టూ పక్కా ప్రదేశాలు అప్రమత్తం చేశారు.  నామినేషన్ అభ్యర్థుల వివరాలను పోలీసులు ఎప్పటికప్పుడు సేకరించి తగు సూచనలు తెలియ జేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#