12:53 AM, 24 Sunday January 2021

నారాయణ మూర్తికి పితృ వియోగం

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

అంబాజీపేట మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ,   సీనియర్ నాయకులు ఆదుర్తి నారాయణ మూర్తి  తండ్రి  ఆదుర్తి నరసింహమూర్తి ( 91 ) గురువారం మరణించారు.  ఆదుర్తి నారాయణ మూర్తి తండ్రి  ఆదుర్తి నరసింహమూర్తి విశ్రాంతి  ఉపాధ్యాయులు, ఆయన ఉపాధ్యాయ వృత్తికి చేసిన సేవలు మరువలేనివని పలువురు అన్నారు. అనేకమందికి ఉత్తమమైన మార్గదర్శిగా ఆదుర్తి నరసింహమూర్తి నిలిచారని పలువురు పేర్కొన్నారు.ఆయన విశ్రాంతి ఉపాద్యాల అసోసియేషన్ కార్యదర్శి గా పనిచేసారు.అయనకు 5 కుమారులు 1 కుమార్తె.అయన భౌతిక కాయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి  నివాళ్లు అర్పించారు.ఏపీసీసీ ఉపాధ్యక్షులు  జంగా గౌతమ్  నారాయణ మూర్తి ని ఫోన్ లో పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు.

ఈ కార్యక్రమం లు ఏపీసీసీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్ఏ, పీసీసీ బిసి కో కన్వినర్ మాచవరపు శివన్నారాయణ, మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు నెల్లి వెంకటరమణలు పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#