03:55 AM, 2 Tuesday March 2021

నిర్మాణ దశలో ఉన్న పనుల్లో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదు

– జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లాలో నిర్మాణదశలో వుండి కొనసాగుతున్న పనుల్లో (ఆన్ గోయింగ్ వర్క్) జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ తన కార్యాలయం నుండి క్షేత్రస్థాయిలో పంచాయితీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్ఆర్ అండ్ బి ఇంజనీర్లతో జిల్లాలో పురోగతిలో వున్న వివిధ భవనాల పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 31వ తేదీ నాటికి గ్రామ సచివాలయాల, ఆర్ బికె ఆరోగ్య కేంద్రాల భవనాల పనులు పూర్తి చేయవలసి వుందన్నారు. లక్ష్యాలు ఉన్నప్పటికి నిర్దేశించిన భవనాల నిర్మాణపు పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సాంకేతిక పరమైన అంశాలతో పాటు ఇతర సమస్యలు ఏమైన వుంటే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఎన్నికల అనంతరం ఎన్నికైన ప్రజాప్రతినిధులు వస్తారని ఆ సమయానికి గ్రామ సచివాలయాల భవనాలు పూర్తి కావాలసి వుందన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని మండలాలతో పాటు రాజోలు, ముమ్మిడివరం, కొత్త పేట, తుని నియోజక వర్గం పరిధిలో పనులు వేగవంతం కావలసి వుందన్నారు. నిర్మాణపు పనులు చేపట్టడం లో అలసత్వం వహించే అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవడంలో ఉపేక్షించేది లేదన్నారు. సచివాలయాలు, ఆర్ బి కెలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణపు పనులు వేగవంతంగా జరిగే విధంగా డివిజనల్, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించినప్పటికి ఆదిశగా పనులు జరగక పోవడం పట్ల వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఇంజనీర్లకు ఆదేశించారు. మొదటి ధపా ఎన్నికలు ఈ నెల 9 మంది ముగియనుండడంతో పెద్దాపురం, కాకినాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న పనులను నేరుగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రకాశం లాంటి వెనుకబడిన జిల్లాలో వీటి పనులు ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయన్నారు. ఉన్నత స్థితిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఆ దిశగా పనులు జరగడం లేదన్నారు. ఈ భవనాల పనులు పూర్తి య్యే వరకు ఎలాంటి ఇతర నిర్మాణపు పనులు చేపట్టరాదని కలెక్టర్ ఇంజనీర్లకు ఆదేశించారు. గ్రామ సచివాలయాల భవనాలు లేనప్పటికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాటి ద్వారా ఇరవై లక్షలకు పైగా సర్వీస్ ధరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. అదే విధంగా తాత్కాలిక ఆర్ బికె కేంద్రాల పనితీరు సంతృప్తికంగా జరుగుతుందన్నారు. రాబోయే 40 రోజుల్లో 200 కోట్ల రూపాయలతో ఈ భవనాల నిర్మాణాలకు ఖర్చు చేయవలసివుందన్నారు. అభివృద్ధిని ఆపడానికి ఎవరైన ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని, గ్రామసచివాలయ, ఆర్ బికె, ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణాల పై జరిగిన సమీక్షలో కలెక్టర్ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#