01:33 PM, 3 Wednesday March 2021

నిస్పక్షపాతంగా రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు జరగాలని ఆర్ పి ఐ జిల్లా అధ్యక్షుడు జుత్తు క డిమాండ్

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులను ఉపయోగించకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తు లను ఉపయోగించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగబద్ధంగా, నిస్పక్షపాతంగా నిర్వహించాలని ప్రతి ఓటరు డబ్బులు కానీ ,మధ్యలో కానీ ,మరి ఏ ఇతర వాటికి లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ఎవరు ఎన్ని ప్రబొలలకు లొంగకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకిచ్చిన టువంటి మన ఆయుధం ఓటుహక్కును సరైనటువంటి నాయకులను ఎన్నుకునే విధంగా ప్రజల ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మధ్యానికి, కానీ మరి ఏ ఇతర వాటికి బానిసలు అవ్వకుండా ధైర్యంగా తమ గ్రామ అభివృద్ధికి మీరే మంచి నాయకులను ఎన్నుకునే విధముగా ఎవరు మనకు ఎటువంటి నాయకుడు కావాలో ప్రజలందరూ తమ ఇష్టపూర్వకంగా ఎన్నుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#