03:06 AM, 24 Sunday January 2021

నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభం కలగాలి…

పెనుమంట్ర, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రజలందరికీ యేసుప్రభువు దీవెనలు ఉండేలా క్రైస్తవ సమాజం ప్రార్థనలు చేయాలని,గతించిన సంవత్సరం చేదు జ్ఞాపకాలను మిగిల్చింది నూతన సంవత్సరంలో శుభం కలగాలని  వైయస్సార్ సిపి నాయకులు కర్రి వేణుబాబు అన్నారు.శివరావుపేటలోని గాస్పల్ చర్చి ఆవరణలో,ఫౌండర్ తానేటి ఏసురత్నం ఆధ్వర్యంలో జరిగిన  క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 35 సంవత్సరాల పైబడి పోస్ట్ మ్యాన్ గా విశేష సేవలు అందించి పదవీ విరమణ చేసిన టీ.పి.జే.గోపాలకృష్ణను అతిథులందరూ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఆఫ్ ది పేరిస్ చర్చి కౌన్సిల్,జి.ఆశీర్వాదం(మార్టేరు),మాట్లాడుతూ ప్రపంచంలోని గ్రంథాలన్నీ వాక్యంలోనే దేవుడున్నాడు అనే మాటను ప్రచురించారనీ,కాని ప్రజలు అసలు సృష్టికర్తను మరిచి పరిపరి విధాలుగా దేవుని వెతకటం ద్వారా అనవసరమైన బాధలు కొని తెచ్చుకుంటున్నారు అన్నారు.కరోనా వ్యాధితో లక్షలాది మంది ప్రజలు చనిపోయారని అయితే దేవుడు మరింత కనికరం చూపడం పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించాలని కోరారు.అనంతరం కార్యక్రమంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటుచేసిన కేక్ను సిస్టర్ రత్నరోస్, వైసిపి నాయకులు కర్రి వేణుబాబు ముఖ్య అతిథులు కలిసి కట్ చేయగా,చిన్నారులు,యవ్వనస్తులు క్రిస్మస్ పాటలు సాంస్కృతిక నాటికలు,బైబిల్ సందేశాలను తెలియజేశారు. నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్ మీడియా వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల సాల్మన్ దొర, నాయకులు పత్తికాయల శ్రీనివాస్, విశ్రాంత లెక్చరర్ కే.సత్యనారాయణమూర్తి,ఏఐసీసీ అధ్యక్షుడు చవ్వాకుల భరత్,టి.జ్యోతిబాబు,టి.జోయల్,ఆర్థర్ రోనాల్డ్ &టీమ్,కే.క్రిస్టఫర్,కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#