02:21 AM, 24 Sunday January 2021

నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి

– రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా
– ఎంఎంజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ జన్మదిన వేడుకలు

కాకినాడ రూరల్, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నేటి యువత సమాజం పట్ల సేవా దృక్పధాన్ని అలవర్చుకోవాలని మాదిగ మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పిడి దైవ వరప్రసాద్ అన్నారు. మంగళవారం కాకినాడ స్థానిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపవరపు కుమార్, ఆ సంఘం ఆధ్వర్యంలో ముప్పిడి దైవ వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర ప్రసాద్ కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశంలో తీవ్ర జాప్యం వహిస్తున్నారని ఆరోపించారు. మాదిగ జాతి లో ఉన్న మేధావులు, విద్యావంతులు పలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాజ్యాంగపరంగా అందవలసిన రిజర్వేషన్ ఫలాలను సాధించుకునేందుకు మాదిగ సోదరులంతా ఐక్యం కావాలని వరప్రసాద్ పిలుపునిచ్చారు. అనంతరం కుమార్ మాట్లాడుతూ జాతి సమగ్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగంగా పెట్టి బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకుని జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్న అందరివాడు నిగర్వి ముప్పిడి దైవ వరప్రసాద్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పలివెల గోవిందు, రాష్ట్ర కార్యదర్శి మసకపల్లి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు టేకెటి సారధి, జిల్లా అధికార ప్రతినిధి దండు పృథ్వి రాజ్, మాదిగ సీనియర్ నాయకులు తొమ్మండ్ర సురేష్, ఎండిఎఫ్ నాయకులు మోర్త రవి, ఎంఎంజేఎస్ నాయకులు మడికి గోపి, పాలేటి రవి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#