– మరో కొన్ని కుటుంబాలు ఆనంతబాబు ఆధ్వర్యంలో చేరిక
– ప్రభుత్వ సంక్షేమాలకు ఫిదా అయిన కార్యకర్తలు
– తన సొంత ఖర్చుతో వైసిపి దిమ్మె ఏర్పాటు చేసిన నరేష్
వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
నేడు మండలంలోని తెల్లవారిగూడెం గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమం అనంతరం రేఖపల్లి గొల్లగూడెం గ్రామంలో వైసిపి దిమ్మె పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగ నున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసిబి చైర్మన్ ఆనంతబాబు, రంపచోడవరం నియజక వర్గ ఎమ్యెల్యే నాగులపల్లి ధన లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వారి చేతుల మీదగా జెండా అవిష్కరణతో పాటు, పలు కుటుంబాలు వైసీపీలో చేరనున్నాయి. ఇన్నాళ్లు వేరే పార్టీ లో ఉన్న కుటుంబాలు వైసీపీలోకి రావడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు అని తెలుస్తుంది. ఈ కుటుంబాలు వైసీపీలోకి రావడానికి మండల వైసిపి నాయకులు 12 మంది కృషి ఉన్నది.
మండల నాయకుల ఆధ్వర్యంలో గత నెలలో కొన్ని కుటుంబాలు వచ్చాయి
మండల నాయకుల ఆధ్వర్యంలో గత నెలలో కొన్ని కుటుంబాలు వైసీపీలోకి రావడం జరిగింది. ఇదే క్రమంలో నేడు మరికొన్ని కుటుంబాలు వైసీపీలో చేరనున్నాయి. వీరంతా సిపియం పార్టీ ని వీడి వస్తున్నట్లు తెలిపారు. పార్టీ దిమ్మె ఆవిష్కరణ కూడా డిసిసిబి చైర్మన్ ఆనంతబాబు, రంపచోడవరం నియజక వర్గ ఎమ్యెల్యే నాగులపల్లి ధన లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదగా ఆవిష్కరణ చేయనున్నారు. దిమ్మెను ఆ పార్టీలోకి కొత్తగా వచ్చిన కార్యకర్త నరేష్ తన సొంత ఖర్చుతో కాంట్రాక్టర్ వెంగళరావు నిర్మించి రంగులతో అలంకరించడం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టుతున్న పథకాలకు తమ కుటుంబాలు ఫిదా అయి నరేష్ అనే వ్యక్తి సుమారు రూ. 30 వేల రూపాయలు తన సొంత ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ తమ గ్రామాలకు నేటికి సదుపాయాలు లేవని రోడ్డు మార్గం నిర్మించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామ సమస్యలు ఏమి ఉన్న వైసిపి నాయకత్వంలో ఆనంతబాబు గారి సహకారంతో ఇక్కడి ప్రజలకు సహకారం అందించాలని కోరారు.