01:02 PM, 14 Thursday January 2021

నేడు చొప్పెల్ల లేఅవుట్లో ఇంటి పట్టాలు పంపిణీ

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గూడు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి నివాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంలా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ నేడు  మండలం పరిధిలో చొప్పెల్ల లేఅవుట్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని స్థానిక ఎంపీడీవో జేఏ జాన్సీ సోమవారం నాడు తెలిపారు. మంగళవారం కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి  చేతుల మీదుగా చొప్పెల, నర్శిపూడి, సంధిపూడి, పెద్దపల్ల, పినపల్ల గ్రామాలకు చెందిన లబ్ధిదారులు  ఉదయం 10 గంటలకు చొప్పెళ్ల లేఅవుట్ కు చేరుకోవాలని ఎంపీడీవో తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాలని తెలిపారు. అలాగే పట్టాలు పొందేందుకు వచ్చే లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా గ్రామ వాలంటీర్లు, ఆయా గ్రామ సచివాలయ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ పరిపాలనా అధికారి టీవీ సురేందర్రెడ్డి, హౌసింగ్ ఏఈ జేజిబాబు, ఈవోపీఆర్డీ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#