10:56 PM, 1 Monday March 2021

నేడే పల్స్ పోలియో

– జిల్లాలో 4,69,445 మంది చిన్నారులను గుర్తించిన అధికారులు
– పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రతీ ఏటా జనవరి నెలలో ప్రభుత్వం చేపట్టే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఈనెల 31న నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జరిగే పల్స్ పోలియో వ్యాధిని నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు వైద్య అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 31 ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 0-5 ఏళ్ళ లోపు 4,69,445 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తొలిరోజు 3866 పల్స్ పోలియో భుత్ లలో చిన్నారులకు టీకాలు వేయనున్నారు. ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో ఇంటింటికి తిరిగి చుక్కల మందు తీసుకుని చిన్నారులను గుర్తించి చుక్కలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, తదితర ప్రాంతాల్లో 93 ట్రాన్సిట్ భుత్ లను ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయాల్లో చిన్నారులకు సమయానికి పోలియో చుక్కలు మందు అందజేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పలు ప్రాంతాల్లో ఉండే చిన్నారులకు ప్రత్యేకంగా 140 మొబైల్ బూత్ ల ద్వారా పోలియో చుక్కలు వేయడాని ఏర్పాట్లు చేసారు.
జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో విధుల్లో 15,912 మంది….
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే 15912 మంది వైద్య సిబ్బందిని సిద్ధం చేసింది. వీరిలో 4651 ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు 5546 మంది, పారామెడికల్ సిబ్బంది 7470, ఇతరులు 313 మంది ఈ కార్యక్రమానికి కేటాయించారు. 6 లక్షల 40 వేల డోసులు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని మూడు రోజులు ముందే పీ హెచ్ సీ లకు ఈ డోసులు చేర్చారు. వీటిలో జిల్లాలో ఉన్న కోల్డ్ చైన్ వ్యవస్థల ద్వారా భద్రపరిచారు. వీటికోసం అవసరమైన ఐఎల్ఆర్ఎస్ యూనిట్లు, డీప్ ఫ్రీజర్, వ్యాక్సిన్ కారియర్స్, ఐస్ ప్యాకెట్లను, కోల్డ్ బాక్స్ లను సిద్ధం చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గౌరీశ్వర రావు తెలిపారు.
జిల్లా మొత్తం జనాభా  :54,27,870
మొత్తం గ్రామాలు        : 1845
మొత్తం ఇల్లు               :12,48,542
మొత్తం హ్యాబిటేషన్    :2796
0 నుంచి 5 ఏళ్ళలోపు :4,69,445
డోసుల లక్ష్యం             :6.40 లక్షలు
పోలియో చుక్కల కేంద్రాలు : 3866
పోలియో చుక్కల ప్రోగ్రాం లో పాల్గొనే సిబ్బంది: 15,912
జిల్లాలో పల్స్ పోలియో లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.. డిఎం హెచ్ఓ డాక్టర్ గౌరీశ్వర రావు జిల్లాలో ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ గౌరీశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.4,69,445 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయనీ వెల్లడించారు. వైద్యాధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. మొదటిరోజు 98-99 శాతం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మిగిలిన రెండు రోజుల్లో నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వి అరుణ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#