పెనుమంట్ర, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
పోలింగ్ జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఎన్నికల నియమావళి రికార్డులలో తక్షణమే రికార్డు చేసుకునే బాధ్యత ఆ బూత్ ప్రొసీడింగ్ అధికారి తీసుకోవాలని ఎంపీడీవో ఆర్.విజయరాజు, తహసిల్దార్ వై.దుర్గాకిషోర్ లు సంయుక్తంగా తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే సిబ్బందికి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధానాలపై ఉపాధ్యాయులకు అవగాహన క్రమశిక్షణ కార్యక్రమంఆలమూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూతులో బ్యాలెట్ బాక్సులలో ఓటర్లతో అక్రమంగా ఓటు వేసుకునే సదుపాయం కల్పించాలన్నారు.అనివార్య కారణాల వలన ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటన జరిగిన ,నిలిచిపోయిన వెంటనే ప్రొసీడింగ్ రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను సీల్ చేసే బాధ్యత తమదేనని సూచించారు.మొత్తం నూట తొంభై రెండు (192) బూతులలో పోలింగ్ జరపడానికి కావలసిన సౌకర్యాలు ఉపాధ్యాయులకు అందించడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దిడ్ల.శారద జ్యోత్స్న, ఈ ఓపిఆర్ఈడి ఎం.శ్రీనివాసరావు , ఆర్.డబ్ల్యూ.యస్ ఏఈ బుజ్జేశ్వరావు,నూట డెభై నాలుగు మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.