03:27 PM, 2 Tuesday March 2021

పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరుపుకోవాలి

– మండల అధికారులకు ఎన్నికలపై సూచనలు జారీ చేస్తున్న సిఐ గీతా రామకృష్ణ
– ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి
– ఎన్నికల కోడ్ అమల్లో విఘాతం కలిగిస్తే చర్యలు

కూనవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సహకరించాలని ఎటపాక సీఐ గీతా రామకృష్ణ అన్నారు. ఫిబ్రవరి నెలలో జరగనున్న నాలుగో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం కూనవరం తహశీల్దారు కార్యాలయంలో తహశీల్దారు ఏవిఎల్ నారాయణ, ఎంపిడిఓ సత్యనారాయణ మూర్తి, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఫిబ్రవరి 17 న జరగనున్న ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి డిఎస్పి స్థాయిలో పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎంపిడిఒ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం 2019 ఓటర్ జాబితాతో ఎన్నికలకు వెళ్తున్నామని, ఆ తరువాత ఓటు నమోదు చేసుకున్నవారి ఓట్లు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 6,7,8 తేదిల్లో అభ్యర్దుల నామినేషన్ల స్వీకరణ, 9వ తేదిన ఉపసంహరణలు ఉంటాయని,17వ తేదిన ఎన్నికలు అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడతాయని స్పష్టం చేశారు. తహశీల్దారు నారాయణ మాట్లాడుతూ మండలంలోని పోలింగ్ కేంద్రాలు, ఆయా కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాట్లపై సిబ్బందికి విధి, విధానాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కూనవరం ఎస్ఐ గుణశేఖర్, రెవెన్యూ, పంచాయతి రాజ్ సిబ్బంది పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#