04:54 AM, 3 Wednesday March 2021

పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు

ఎన్నికల్లో అల్లర్లు , గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు
– ఎటపాక సీఐ గీతారామకృష్ణ హెచ్చరిక 

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రానున్న ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో అల్లర్లు , గొడవలకు ప్రతీఒక్కరూ దూరంగా ఉండాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎటపాక సీఐ గీతారామకృష్ణ హెచ్చరించారు. మండలంలోని గుండాల పంచాయతీలో పర్యటించి అన్ని పార్టీల రాజకీయ నాయకులతో శనివారం సీఐ గీతారామకృష్ణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులు , గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున అల్లర్లు , గొడవలు , అసాంఘిక కార్యకలాపాలు వంటి వాటి జోలికి పోయి కేసుల్లో ఇరుక్కోవద్దని , జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అల్లర్లు ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నట్లు తెలిసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే చూస్తూ ఊరుకునేది లేదని సీఐ హెచ్చరించారు. ఈ సదస్సులో ఎటపాక ఎస్సై చినబాబు , పోలీస్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

 

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#