12:02 PM, 3 Wednesday March 2021

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తి సంసిద్ధత తో ఉండాలి…

– జిల్లా ఎన్నికల సహాయ అధికారి, ఎం పి డి వో ఎం శ్రీను.

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎన్నికల సహాయ అధికారి, ఎం పి డి వో ఎం శ్రీను ఆదేశించారు. శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లకు ఎన్నికల శిక్షణా తరగతులను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎం పి డి వో మాట్లాడుతూ  రాయవరం లో రెండవ  విడత ఫిబ్రవరి 2వ  తేదీన నోటిఫికేషన్  జారీ,నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గం ల వరకు ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ఏర్పాట్లను సిద్ధం చేసి, పంచాయతీ ఎన్నికల ను సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని  ఎన్నికల సిబ్బంది క్షుణ్ణంగా చదువు కొని ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగ కుండా చూడాలన్నారు. ముందుగా ఎన్నికలు నిర్వహించే పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలన్నారు.
తాసిల్దార్ కే జే ప్రకాష్ బాబు మాట్లాడతూ రాయవరం లో  రెండవ విడత పంచాయితీ ఎన్నికల నిర్వహణ జరగనుందని అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఫిబ్రవరి 2వ తేదీన నోటిఫికేషన్ జారీ, ఉదయం 10.30 గం నుండి  సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నామినేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 4వ తేదీ వరకూ ఉంటుందని అన్నారు.5వ తేదీ నామినేషన్ల పరిశీలన , 6వ తేదీ అభ్యంతరాల(రిజక్షన్స్) పరిశీలన, 7వ తేదీ  తుది నిర్ణయం(డిస్పోసల్ అప్పీల్స్), 8వ తేదీ ఉపసంహరణ(విత్ డ్రాల్స్) ఉంటాయన్నారు.
ఫిబ్రవరి 13వ తేదీ పోలింగ్ ప్రక్రియ ఉదయం 6:30 నుండి సాయంత్రం 3:30 వరకు జరుగుతుందన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఎస్సై పి వి యస్ యస్ ఎన్ సురేష్ మాట్లాడతూమండలంలో ఉన్న 12 గ్రామాల వారీగా  సమస్యాత్మక(4), అత్యంత సమస్యాత్మక (3)  మొత్తం 7 గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో  మైక్రో అబ్జర్వర్లను నియమించడం తో పాటు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.   ఏ ప్రాంతంలో నైనా ఎన్నికల నియమావళి ని ఉల్లంఘిస్తన్నట్లు దృష్టి కి వస్థే  కంట్రోల్ రూం కి కంప్లైంట్ చేయొచ్చు నని వెంటనే తగు చర్యలు తీసుకొంటామని ఎస్సై సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ జే ఈ వి. రామనారాయణ, పంచాయితీ విస్తరణ అధికారి బి అశోక్ కుమార్, ఆర్ డబ్ల్యూ యస్ జే ఈ చైతన్య కుమారి, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు తదితరలు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#