04:35 PM, 3 Wednesday March 2021

పంచాయితీ గెలిచి బాబు పేరు నిలబెడతాం

– వడ్డిగూడెం వైసిపి సర్పంచ్ అభ్యర్థి నర్సమ్మ
– రెండవరోజు వైసిపి తరుపున నామినేషన్ వేసిన నర్సమ్మ.

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలోని ప్రధాన మైన గ్రామ పంచాయితీ అయిన వడ్డిగూడెం గ్రామ పంచాయితీ లో వైసిపి తరుపున తనకు సర్పంచ్ అభ్యర్థిగా సీటు ఇచ్చినందుకు  జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ భాస్కర్  గారికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు సర్పంచ్ అభ్యర్థి సోడి నర్సమ్మ తెలిపారు. వడ్డిగూడెం పంచాయితిలో వైసిపి తరుపున నిలబెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞత లు తెలియ జేస్తున్నట్లు వైసిపి నూతన సర్పంచ్ అభ్యర్థి సోడి నర్సమ్మ అన్నారు.  ఆదివారం నర్సమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వెయ్యడం జరిగింది. ఆనంతబాబు నా మీద వున్న నమ్మకంతో అభ్యర్థిగా నియమించారు కాబట్టి ఆయనకు ఈ పంచాయితిని గెలిచి ఆయనకు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.  గ్రామ పంచాయితిలోని ఓటర్లు అందరూ తనకు ఓటు వేయాలని కోరారు. ఇప్పటికే  ముఖ్య మంత్రి జగన్  మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పధకాలు పెట్టి ప్రజల .మనసును గెలిచిన ముఖ్య.మంత్రిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఆయనకు అందరూ రుణపడి ఉండాలని కోరారు. ఆయన బాటలోనే  గ్రామాల్లో అభి రుద్ది పనులు చేసి ప్రభుత్వం కు మంచి పేరు తీసుకు వస్తానని అన్నారు. వడ్డిగూడెం గ్రామ పంచాయితిలలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని కాబట్టి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#