03:06 AM, 8 Monday March 2021

పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి…

– వైకాపా చైర్మన్అభ్యర్థి ప్రచారం

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండపేట పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని మండపేట వైఎస్ఆర్సిపి చైర్ పర్సన్ అభ్యర్థి పతివాడ నుక దుర్గా రాణి పేర్కొన్నారు. మండపేట 20వ వార్డు నుండి  నుంచి వైస్సార్ సిపి కౌన్సిలర్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో గొల్లపుంత కాలని లో ప్రతిరోజు పర్యటిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం 20 వార్డులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి గడప  కు ఏదో ఒక ప్రభుత్వ పథకం  అందుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయని రీతిలో సంక్షేమ పథకాలను అమలు  చేస్తూ రాజన్న రాజ్యం తీసుకొస్తున్నారన్నారు. ఈ క్రమంలో మండపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం విజ్ఞత గల ప్రజలు వై ఎస్ ఆర్ సి పి కి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు నాయకత్వంలో పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని ముఖ్యంగా శివారు ప్రాంతాల అభివృద్ధి పై దృష్టి సారించి అక్కడ రోడ్లు డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన ను కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన పలువురు మహిళలతో పాటు వైకాపా నాయకులు ,కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#